సంస్కృతిలో తండ్రి గొప్పతనం ! పురాణాలలో తండ్రినిలా వర్ణించారు.
న తో ధర్మచరణం కించిదస్తి మహత్తరమ్ I
యథా పితరి శుశ్రూషా తస్య వా వచనక్రిపా II
-వాల్మీకి (రామాయణం, అయోధ్యకాండ)
తండ్రికి సేవలు చేయడం, ఆయన ఆజ్ఞలను పాటించడంకన్నా మించిన మరో ధర్మాచరణ లేదని ఈ శ్లోకం అర్థం
జ్యేష్ఠో భ్రాతా పితా వాపి యశ్చ విద్యాం ప్రయచ్ఛతి I
త్రయస్తే పితరో జ్ఞేయా ధర్మే చ పథి వర్తిన: II
-వాల్మీకి (రామాయణం, కిష్కింధకాండ)
పెద్దన్నయ్య, తండ్రి మరియు విద్యను ప్రసాదించే గురువు- వీరు ముగ్గురుకూడా ధర్మ మార్గాన్ననుసరించే తండ్రిలాంటి వారు. వీరినికూడా తండ్రితో సమానంగా గౌరవించాలంటోంది మన హిందూ ధర్మం.
దారుణే చ పితా పుత్రే నైవ దారుణతాం వ్రజేత్ I
పుత్రార్థే పద:కష్టా: పితర: ప్రాప్నువన్తి హి II
-హరివంశ్ పురాణం(విష్ణు పర్వం)
పుత్రుడు క్రూర స్వభావం కలవాడైనాకూడా తండ్రి అతనిపట్ల ప్రేమగానే చూస్తుంటాడు. ఎందుకంటే తన పుత్రుడికొరకు ఎన్నో కష్టాలను ఎదుర్కొనేది తండ్రేనని పురాణాలు చెపుతున్నాయి.
జనితా చోపనేతా చ, యస్తు విద్యాం ప్రయచ్ఛతి I
అన్నదాతా భయత్రాతా, పంచైతే పితర: స్మృతా: II
-చాణక్య నీతి
ఈ ఐదుగురుకూడా తండ్రితో సమానమని చాణక్య నీతి చెపుతోంది. (జన్మనిచ్చేవాడు, ఉపనయనం చేసేవాడు, చదువు చెప్పేవాడు, అన్నదాత, భయాన్ని పోగొట్టేవాడు
No comments:
Post a Comment