Friday, March 2, 2012

శ్రీ ప్రభో వేంకటేశా







ఓం వెంకటేశాయ విద్మహే శ్రీనివాసాయ ధీమహి
తన్నో విష్ణుః ప్రచోదయాత్ ఓం భూర్భువస్సువః
ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి
ధియోయోనః ప్రచోదయాత్

ప్రభో వెంకటేశా విభో శ్రీనివాసా!!
నమో దేవ దేవా నమో సర్వ రూపా!!

ప్రభో వెంకటేశా విభో శ్రీనివాసా!!
నమో దేవ దేవా నమో సర్వ రూపా!!
సదా శ్రీవ లీల ఇరాదీందు లీల
నినే కంట చూసి తరించానులేరా

ప్రభో వెంకటేశా విభో శ్రీనివాసా!!
ప్రభో వెంకటేశా!!

సహస్ర శీర్షం దేవం విశ్వాక్షం విశ్వ శంభువం
విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం
విశ్వదః పరమాన్నిత్యం విశ్వం నారాయనగుం హరిం
విశ్వమే వేదం వరుణస్తద్విశ్వముపజీవతి

నిఖిలాంగ దైవాలు నీ దాసులూ
అఖిలాండ మేలేటి ఈ భక్తులూ
విశ్వాంతరాళాల యుగ సంధిలో విజ్రుంభమాణాలు నీకాంతులు
జాహ్నవి పుట్టిన పాదం నరజాతికదే అభిషేకం
ఆపద మొక్కులు తీర్చే నీ శ్రీపదమే సుశ్లోకం
ఎన్నో కొండలెక్కి వెలిగేటి రూపం ఎన్నో మెట్లు దాటి వచ్చే మాదు జన్మం
ఆదిత్య తాపా రుత్ర్యేంద్ర రూపా వేదాంత రూపా విజ్ఞాన దీపా
నిన్నే కన్నానయ్యా శక్తి రూపా!!

స్వర సప్తక శైలేంద్ర విలాసా ఆ ఆ ఆ ఆ
అగుమా ప్రణవా కార విలాసా
వేదనలూదిన వేణువు నీవు ఆ శివుడెరుగని వెన్నెల నీవు
మాటలకందని మౌనం నీవు బ్రహ్మకు తెలియని వేదం నీవు
పరమ హంసలకు యోగం నీవు హృదయ నేత్రముల శాస్త్రము నీవు
దివిని వీడి ఇటు భువిని చేరుకొని కలిమినేలు ఘన దైవం నీవు
త్రేతాయుగమున రామా రారా ధరణిజ సోమా
ద్వాపరయుగ గోపాలా నందనమాయెను నేల
కలియుగ విరజా పుష్కరిణీ తట భక్త కోటి పరిపాలా
నిగామాకాశపు నీలిమలంటిన సూర్య చంద్ర మణి హార
రసనావేదం రగిలే ఘన వ్యసనావేశం కలిగే
తిరుమల నాలో ఎదిగే శుభ తిరుపతి నాలో వెలిగే
భుక్తికి పెంచిన దేహం ముక్తిణి కోరే...
భక్తికి లొంగిన ఆత్మలు నీ పరమాయే

వెంకట రమణ సంకట హరణ శంకర సదనా
వెంకట రమణ సంకట హరణ శంకర సదనా

ప్రభో వెంకటేశా..! వెంకటేశా..!
శ్రీనివాసా..! శ్రీనివాసా..!

ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా.. గోవిందా...!
ఆపదమోక్కులవాడ... అడుగడుగు దండాలవాడ... వడ్డికాసులవాడ.... గోవిందా.. గోవిందా...!

No comments: