Friday, March 30, 2012
శ్రీరామ నవమి
శ్రీ రామ రామ రామేతి రామే రామే మనోరమే
సహశ్రనామ తత్‌తుల్యం రామనామ వారాననే! (2)
రాముడుద్భవించినాడు రఘుకులంబునా
చైత్రమాసం,పునర్వసు నక్షత్రం,నవమి రోజున శ్రీ రామచంద్రుడు జన్మించెను.
నవమి నాడే సీతామహాదేవితో వివాహముజరిగెననీ,
నవమి నాడే రాజ్య పట్టాభిషేకము జరిగెనని రామాయణ కావ్యము తెలుపుచున్నది.
శ్రీ రామ చంద్రునికి నవమికి వున్న యీ సంబంధం వల్ల శ్రీరామనవమి పండుగను
భారతీయులందరూ ప్రతి సంవత్సరం చైత్ర మాసంలో నవమి నాడు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు.
శ్రీరామ నవమి వేసవి కాలంలో వచ్చే పండుగ.చైత్ర శుద్ధ నవమి నాడు,
అనగా చైత్ర మాసంలోని శుద్ధ నవమి పునర్వసు నక్షత్రం కూడిన రోజున శ్రీరామ నవమి జరుపుకుంటారు.
వందే రఘునందనం
దక్షిణే లక్ష్మణో ధ్వనీ వామతో జానకీ శుభా
పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనం
యత్రరామో భయం నాత్ర నాస్తి తత్రపరాభవః
సహి శూరో మహాబాహుః పుత్రో దశరధస్య చ !!
కుడివైపు ధనర్ధుడైన లక్ష్మణునితో
ఎడమవైపు శుభ లక్ష్మణ అయిన జానకీదేవితో,
ఎదురుగా ఆంజనేయునితో ఉన్న ఆ రఘునందనునికి వందనం.
శూరుడు,మహావీరుడూ, అయిన రాముడు ఎక్కడ వుంటాడో
అక్కడ భయమనేది వుండదు.
రామ మహిమ, రామనామమహిమ ఎంతటివంటే
రాముని చరితలో ఒక్క అక్షరమే మహాపాతకాలను
నశింపజేస్తుందని మహాకవి మనకు హామీ ఇస్తున్నారు.
రాముడు కల్యాణ గుణధాముడు.పావన చరితుడు.
జగత్తులోని మంచినంతటినీ రాశిపోయగా ఏర్పడినవాడే జగదభిరాముడు.
అందుకే రాముడూ,రామాయణమూ ఉన్నచోట అంతా శుభమే కాని,దారిద్య్రాము,
ధఃఖమూ,అనేవి వుండవు.లౌకిక ఆధ్యాత్మికాల మధ్య సేతువు కట్టినవాడు రాముడు.
ఆ రెంటి మధ్య తేడా లేదనీ ఆచరణలో బోధించిన వాడు రాముడు.
ఆ సుగుణాభిరామిని జీవితగాధ నుంచి ఏ కొంచం స్ఫుర్తించినా,
ఆధ్యాత్మిక శిఖరాలను అందుకోంటాం.అటువంటి పుణ్యశ్లోకుని,
పురుషోత్తముని స్మరించుకొనే శ్రీరామ నవమి పర్వదినం ఈ మాసంలోనే.
ఈ వసంతం ప్రతి ఒక్కరి జీవితంలోనూ నవ్యవసంతాన్ని నింపాలనీ
కోరుకొంటూ ఉగాది శ్రీరామ నవమి సంధర్భంగా
బ్లాగు ప్రజలందరికీ నా హౄదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను.
పూజకైనా వినాయకధ్యానం,సంకల్పం,పూజ చేసె దేవునికి
షోడశపూజలు మాములే గనుక పూజ యధావిధిగా వాటిని ముగించి
ఆపై శ్రీరామాష్టకం,శ్రీరామ అష్టోత్తరం,జానకీ అష్టకం పఠించి
పూవులతో పూజ చేయాలి.చైత్రమాసం మల్లెలమాసమే గనుక
మల్లెపూవులతో పూజించడం శుభప్రదం.
మల్లెపూవులు లభ్యంకాని ప్రాంతాలలో వుండేవారు
ఏదైన సువాసనలుగల తెల్లరంగు పూవులతో సీతాలక్షమ్ణాంజనేయ
సమేత శ్రీరామ పఠానికి పూజించాలి.
వడపప్పు,పానకం, శ్రీరామయ్యకు ప్రీతి. అంటే స్వామి
ఖరీదైన వ్యయప్రయాసలతో ముడిపడిన పిండివంటలేవీ కోరుకోడనీ
స్వామి సాత్వికుడనీ భక్తులనుండి పిండివంటలుగాక పరిపూర్ణ భక్తి
విశ్వాసాలు మాత్రమే ఆశిస్తాడనీ మనకు అర్థం కావాలి.
వడపప్పు స్నానానికి ముందుగా నానబెట్టుకోకూడదు.
స్నానానంతరం మొదట వడపప్పు నానబెట్టుకొంటే,
తక్కిన వంటలు పూజాదికాలు పూర్తయి,నైవేద్య సమయానికి
ఎలాగూ నానుతుంది.ఆరోజు ఏ వంట చేయాలనుకొన్నారో
ఆ వంట పూర్తిగావించి అదికూడా నైవేద్యం చేయాలి.
వీటితోపాటు ఏదైన ఒక ఫలం నివేదించాలి.
పూజ పూర్తయి నైవేద్యం అయ్యకా తప్పనిసరిగా ఒక ముత్తైదువకు
గానీ,కుటుంబ సభ్యులు, లేక బందువర్గంలోని పెద్దవారికి గాని
శక్త్యానుసారం తాంబూలం ఈ ప్రసాదాలు,వంటలలో కొంత భాగం
ఇచ్చి,కాళ్ళకు నమస్కరించాలి.ఆనాటి రాత్రి ఏదైన అల్పాహారంతో
ఉపవాస దీక్ష చేయాలి.పండ్లు,పాలతో గడిపితే మరింత శ్రేష్టం.
అంటే ఈ పూజరోజున ఒకపూట భూజనం చేయాలన్నమాట
చైత్రమాసంలోని పునర్వసు,నక్షత్రాలలో కుదరకపోతే
ఏ నెలలోనైన పునర్వసు నక్షత్రాలలో ఈ పూజ చేసుకోవచ్చు.
భక్తి కుముదంలోని కొన్ని ఆణిముత్యాలను ఇక్కడ పొందు పరిచాను.
తప్పులున్నా క్షమించమని ప్రార్థన.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment