Tuesday, January 10, 2012

తిరుప్పావై--27












































27)కూడారై వెల్లుమ్ శీర్ గోవిందా, ఉన్ఱనై
ప్పాడి పఱైకొండు యామ్ పెరుసమ్మానమ్
నాడు పుకరం పరిశినాళ్ నన్ఱాక
శూడగమే తోళ్ వళైయే తోడే శెవి పువ్వే
పాడగమే యెన్ఱనైయ పల్కలనుమ్ యామణివోమ్
ఆడైయడుప్పోం అతన్ పిన్నే పాల్ శోఱు
మూడనెయ్ పెయ్దు మురంగైవరివార
కూడి ఇరుందు కుళిరుంద్-ఏలోర్ ఎంబావాయ్

Thiruppavai in English - Pasuram 27

27)Koodaarai vellum seer Govinda! Unrannai
Paadi-p-paraikondu yaamperu sammaanam
Naadu pugazhum parisinaal nanraaga
Choodagame thol valaye thoday sevi-p-poovay
Paadagame enranaya palkalanum yaam anivom
Aadai uduppom adhanpinnay paar choru
Mooda nei peidhu muzhangai vazhivaara-
Koodi irundhu kulirndhu-el or empaavaai

Thiruppavai in Tamil-திருப்பாவை பாசுரம் 27


27)கூடாரை வெல்லும் சீர் கோவிந்தா! உன்தன்னைப்
பாடிப்பறை கொண்டு யாம் பெறும் சம்மானம்
நாடுபுகழும் பரிசினால் நன்றாக
சூடகமே தோள் வளையே தோடேசெவிப் பூவே
பாடகமே யென்றனைய பல்கலனும் யாமணிவோம்
ஆடையுடுப்போம் அதன் பின்னே பாற்சோறு
மூடநெய் பெய்து முழங்கை வழிவாரக்
கூடியிருந்து குளிர்ந்தேலோ ரெம்பாவாய்.

గోపికలు తామూ ఆచరించబోవు మార్గ శీర్ష వ్రతమునకు కావలసిన పరికరములను వెనుకటి పాసురమున విన్నవిమ్చినారు. అందు వారడిగిన ద్రవ్యములు సులభాములేయైననాను వారు కోరిన వారు కోరిన గునముఅలు గల ద్రవ్యము దుర్లభాములు.అందుచే శ్రీ కృష్ణ పరమాత్మ వీరి హృదయము వస్తువులను గోరుట కాదు,నన్నే కోరి వీరీ వస్తువులను కోరినారు.అనుకొనెను.పాచజన్యమును పోలిన శంఖములను కోరారు.మరి అల్లాంటి శంఖము దొరకదు.ఆ శంఖము శ్రీ కృష్ణుని వీడదు.అందుచే శ్రీ కృష్ణుడే శంఖధరుడై తమతో నుండవలెనని వారు కోరారు.
చల్లా పెద్ద పర కావలెనని గోపికలు కోరారు.శ్రీ కృష్ణుడు త్రివిక్రమావతారమున జాంబవంతుడు త్రివిక్రముని విజయమును చాటుచు వాయించిన పరయోకటి కలదు.శ్రీ కృష్ణ రుపముననున్న నేను కుంభ నృత్యము చేయునప్పుడు కట్టుకొని వాయించిన పర చాల పెద్ద పర.ఈ మూడింటిని ఇచ్చెదనని శ్రీ కృష్ణుడు గోపికలకు చెప్పెను.మంగళా శాసనము చేయువారు కావలెనని కోరిరి.మంగళా శాసనము చేయువారెచట నున్న పరమాత్మయే వారి వెంట నుండునని వీరీ అభిప్రాయము.
తమ దేవేరియగు శ్రీ మహాలక్ష్మి నే మంగళ దీపముగా వారితో ఉండునట్లు అంగీకరించెను.జెండా గరుత్మంతుడు.వారికి గరుడునికుడా ఒసగుటకు శ్రీ కృష్ణుడు సమ్మతించెను.
తరువాత చాందినీగా అనంతునే పంపనంగీకరించెను.మధురా నగరమున జన్మించి వ్రేపల్లెకు వచ్చిన ఆ రాత్రి వర్షమున శ్రీ కృష్ణునకు మేలు కట్టుగా తన పడగలనుపయోగించిన మహానీయుడు కదా! అనంతుడు,పడగ ఆసనము,వస్త్రము,పాదుకలు, తలగడ,చత్రము, చాందిని మొదలగున్నవి విధముల సర్వేస్వరునకు తన శరీరమును భిన్న భిన్న రుపములుగాకుర్చి యుపయోగపడి తనచేతలచే శేషుడు అను పేరు పొందిన మహనీయుడు.వీరు కూడా శేషత్వమునే కోరుతున్నవారగుటచే,శేషునే వారికి చాందినిగా ఇచ్చెను .
ఇలా పరికరములన్నీ సమకూరినవి కదా ! ఇక మీ వ్రతమునకు ఫలమేమో వివరించమని స్వామీ కోరగా.గోపికలు ఈ పాసురమున ఈ వ్రతాచరణముచే తామూ పోందకోరిన ఫలమును వివరించుచున్నారు.ఈ పాసురము విశేషమైనది నేటి నివేదన చక్కెరపోంగళి ఆరగింపుగాఇస్తారు.గోపికలు ఈ పాసురము రోజు 108 గిన్నెలు చెక్కరపొంగలి నెయ్యి ఎక్కువ వేసి మోచేతి నుండి కారునట్లు వేసిచేస్తారు.ఎందుకుఅంటే 26 రోజులు వీరు నెయ్యి వాడలేదు కదా.అందువల్ల ఈ పాసురము రోజు మంచిగా చెక్కెర పొంగలి నివేదిస్తారు.

అర్థము::

తనతో కూడని శత్రువులను జయిమ్చేది కళ్యాణ గుణ సంపదగల గోవిందా ! నిన్ను కీర్తించి వ్రతసాధనమగు పర అను వాద్యమును పొంది పొందదలచిన ఘన సన్మానము లోకులందరు పొగడెడి తీరులో నుండును.చేతులుకు గాజులు మొదలుగు ఆభరణములు, బాహువులకు డందకదియములు,చెవి క్రిందు భాగమున దాలెచేది దుద్దు,పై భాగమున పెట్టుకొనే కర్ణపువ్వులు,కాలి అందెలు మొదలుగు అనేక ఆభరణాలు మేము ధరించాలి.తరువాత మంచి చీరలను దాల్చి వుండాలి.దాని తరువాత పాలు అన్నము మున్నగున్నవి నెయ్యి పోసి ఆ మధుర పదార్ధము మోచేతి వెంబడి కారునట్లు నీతో కలసి కూర్చొని చల్లగా హాయిగా భుజిమ్చవలెను. గోపికలు తమ వ్రత ఫలమును ఇందులో వివరించారు.

No comments: