గోపికలు కృష్ణుని పొంది యనుభవించాలని ఆవేసముచే కృష్ణపరమాత్మ కనిపించగానే తామూ అనుభవించ వచ్చునని తొందరగా మేలుకొన్నారు.కాని శ్రీ కృష్ణుడు మేలుకోలేదు.తరువాత బలరాముని మేలుకోల్పారు.అప్పుడు కుడా కృష్ణుడు మేలుకోలేదు.తెలివి తెచ్చుకొని నీలాదేవి ద్వారా మేలుకోల్పవచ్చని ఆమెని మేలుకోల్పుతున్నారు ఈ పాశురములో .
18)ఉందు మదకళిత్తన్-ఓడాద తోళ్ వలియన్
నంద గోపాలన్ మరుమగళే! నప్పిన్నాయ్!
కందం కమరుం కురలి కడై తిఱవాయ్ వంద్
ఎంగుం కోరి అరైత్తన కాణ్ మాదవి
ప్పందల్ మేల్ పల్గాల్ కుయిల్ ఇనంగళ్ కూవిన కాణ్
పందార్ విరలి ఉన్ మ్మైత్తునన్ పేర్ పా డ
శెందామరై క్కైయాల్ శీరార్ వళై ఒలిప్ప
వందు తిఱవాయ్ మగిరింద్-ఏలోర్ ఎంబావాయ్
Thiruppavai in English - Pasuram 18.
18)Undhu madhakalitran, odhaadha thol valiyan
Nandagopalan marumagale! Nappinnai!
Gandham kamazhum kuzhalee! Kadai thiravaai?
Vandhengum kozhi azhaithana kaann! Maadhavi-p-
Pandalmel palkaal kuyilinangal koovina kaan
Pandhaar virali! Un maiththunan per paada-ch-
Chenthaamarai-k-kaiyaal seeraar valai olippa
Vandhu thiravaai magizhundhu-el or empaavaai
Thiruppavai in Tamil-திருப்பாவை பாசுரம் 18
18)உந்துமத களிற்றன் ஓடாத தோள்வலியன்
நந்த கோபாலன் மருமகளே! நப்பின்னாய்!
கந்தம் கமழும் குழலி! கடைதிறவாய்
வந்துஎங்கும் கோழி அழைத்தன காண் மாதவிப்
பந்தல்மேல் பல்கால் குயிலினங்கள் கூவினகாண்
பந்தார் விரலி!உன் மைத்துனன் பேர்பாடச்
செந்தாமரைக் கையால் சீரார் வளை ஒலிப்ப
வந்து திறவாய் மகிழ்ந்தேலோர் எம்பாவாய்.
అర్థము::
ఏనుగులతో పోరాడగలిగినవాడును,మదము స్రవించుచున్న ఏనుగు వంటి బలముకలవాడును,మదము స్రవించుచున్న ఏనుగులు కలవాడును,యుద్దములో శత్రువులను చూచి వెనుకకు జంకని భుజబలము కలవాడును అయిన నందగోపుని కోడలా ! సుగంధము వెదజల్లు కేశ పాశము గల ఓ నీలాదేవి ! తలుపు గడియ తెరువుము.కోళ్ళు అంతటా చేరి అరుస్తున్నాయి.మదవీలతప్రాకిన పందిరిమీద గుంపులు గుంపులుగా కూర్చొని కోకిలలు కూస్తున్నాయి.కావున తెల్లవారినది,చూడు.బంతిని చేతిలో పట్టుకోన్నదానా! మీ బావ గుణములను కీర్తించుటకు వచ్చితిమి.నీవు సంతోషముతో లేచి నడచి వచ్చి.ఎర్ర తామర పూలు ను పోలిన నీ చేతితో, అందమైన చేతి కంకణములు గల్లుమని ధ్వని చేయునట్లు తలుపు తెరువుము.
అని నీలాదేవిని కీర్తిస్తున్నారు..ఈ పాశురములో అమ్మవారిని దర్శించ వచ్చునని పెద్దలు అంటారు.
No comments:
Post a Comment