Tuesday, January 3, 2012

తిరుప్పావై--20








తిరుప్పావై 20

20)ముప్పత్తుమూవర్ అమరర్క్కు మున్ శెన్ఱు
ముప్పత్తుమూవర్ అమరర్క్కు మున్ శెన్ఱు
కప్పం తవిర్క్కుం కలియే! తుయిల్ ఏరాయ్
శెప్పం ఉడైయాయ్! తిఱలుడైయాయ్ శేత్తార్క్కు
వెప్పం కొడుక్కుం విమలా! తుయిల్ ఎరాయ్
శెప్పన్న మెల్-ములై చ్చెవ్వాయ్ చ్చిఱు మరుంగుల్
నప్పినై నంగాయ్! తిరువే! తుయిలెరాయ్
ఉక్కముం తట్టొళియుం తందు ఉన్-మణాళనై
ఇప్పోదే ఎమ్మై నీరాట్టు-ఏలోర్ ఎంబావాయ్

Thiruppavai in English - Pasuram 20.


20)Muppaththu moovar amarar-ku-munsenru
Kappam thavirkkum kaliye! Thuyilezhaai!
Seppamudayaai! Thiraludayaai! Settraarku
Veppam kodukkum vimalaa! Thuyilezhaai!
Seppanna menmulai-ch-chevvaai-ch-chirumarungal
Nappinnai nangaai!Thiruvey! Thuyilezhaai!
Ukkamum thattoliyum thanthun manaalanai
Ippothe emmai neer att-el or empaavaai

Thiruppavai in Tamil-திருப்பாவை பாசுரம் 20.

20)முப்பத்து மூவர் அமரர்க்கு முன்சென்று
கப்பம் தவிர்க்கும் கலையே! துயிலெழாய்
செப்பம் உடையாய் திறலுடையாய் செற்றார்க்கு
வெப்பம் கொடுக்கும் விமலா! துயிலெழாய்
செப்பென்ன மென்முலைச் செவ்வாய்ச் சிறு மருங்குல்
நப்பின்னை நங்காய்! திருவே! துயிலெழாய்
உக்கமும் தட்டொளியும் தந்துஉன் மணாளனை
இப்போதே எம்மை நீராட்டேலோர் எம்பாவாய்
.

ముందు పాసురములో నీలాదేవిని మేలుకొల్పి,శ్రీ కృష్ణుని మేలుకొలిపి కృష్ణుడుని ఎలాంటివాడో కీర్తిస్తూ నీలా దేవిని ఎలాంటిదో వర్ణిస్తూ ఆమెను శ్రీ కృష్ణుని వారితో స్నానం చేయుటకు పంపమని అర్ధిస్తున్నారు.మరి ఎలా వర్ణిస్తున్నారంటే.

అర్థము::

ముప్పది మూడుకోట్ల అమరులకు వారికింకను ఆపద రాక ముందే పోయి,యుద్ధ భూమిలో వారికి ముందు నిలిచి,వారికి శత్రువుల వలన భయమును తొలగించే బలసాలీ ! మేల్కొనుము అర్జవము కలవాడా ! రక్షణము చేయు స్వభావము గలవాడా ! బలము కలవాడా ! ఆశ్రితుల శత్రువులనే నీ శ త్రువులుగా భావించి వారికి భయ జ్వరమును కలిగించువాడా ! నిర్మలుడా ! మేలుకో ! బంగారు కలశములను పోలిన స్థానములను,దొండపండువలెఎర్రని పెదవియును,సన్నని నడుమును కల ఓ నీలాదేవి! పరిపుర్ణురాలా! లక్ష్మీ సమానురాలా! మేలుకొనుము.వీచుటకు ఆలవట్టమును (హంద్ ఫన్) కంచుతద్దమును మా కోసంగి నీ వల్లభుడగు శ్రీ కృష్ణునితో కలసి మేము స్నానము చేయునట్లు చేయుము.

No comments: