Friday, May 4, 2007

శ్రీ రామ మిందీవర శ్యామం











ప) రామ మిందీవర శ్యామం పరాత్పర
ధామం సుర సార్వభౌమం భజే

చ) సీతావనితా సమేతం
పీత (స్ఫీత) వానర బలవ్రాతం
పూత కౌసల్యా సంజాతం
వీత భీత మౌని విద్యోతం

చ) వీర రణరంగ ధీరం
సారకులోద్ధారం
కౄర దానవ సంహారం
శూరాధారాచార సుగుణోదారం

చ) పావనం భక్త సేవనం
దైవిక విహగపథావనం
రావణానుజ సంజీవనం
శ్రీ వేంకట పరిచిత భావనం

No comments: