
మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు
శివం అంటే శుభం, శివరాత్రి అంటే శుభాలనిచ్చేరాత్రి అని అర్థం.
శివరాత్రి పండుగను యావత్తు భారతదేశం జరుపుకొంటుంది.
మహాశివరాత్రి పండుగ , మాఘమాసం,బహుళచతుర్ధశి రోజు
అమావాస్యకు ముందు వస్తుంది.
ఆదిభగవానులైన బ్రహ్మ దేవుడు,శ్రీనివాసుడు,కుబేరుడు,ఇంద్రుడు,
సూర్యుడు,చంద్రుడు,అగ్నిభగవానుడు, మొదలగువారు
శివరాత్రి వ్రతం గావించి ఉన్నతదేవుళ్ళుగా పేరుగాంచారు.
ఈ శివరాత్రివ్రతాన్ని ఫలానా వారే చేయాలని నియమమేమీ లేదు.
ఎవరైనా ఆచరించవచ్చు.
సర్వవిధ పాపాలను హరించగల శక్తి కల్గినట్టి వ్రతం ఈ శివరాత్రీ వ్రతం.
!!! !!! శివరాత్రి చరిత్ర !!! !!!

పూర్వం బ్రహ్మా , విష్ణువులు పరమేశ్వరుణ్ణి విస్మరించి తమలో తామే
నేను గొప్ప అంటు వాదించు కుంటున్న సమయంలో వారి మధ్యన పరమేశ్వరుడు
ఆది అంటాము లేని విధగా, ఒక మహాజ్యోతి లింగారుపమున ప్రత్యక్షం అయ్యాడు.
శివుని ఆది అంటాము కనబడక పోవడంతో బ్రహ్మా , విష్ణువులు శివుని అనుగ్రహం కోరారు.
శివుడు నీల కంఠము,త్రినేత్రంతో కూడుకొన్న తన విశ్వరూపాన్ని చూపించాడు.
ఆయన విశ్వరుపానికి బ్రహ్మా విష్ణువులు విస్మయం చెంది, శివునికి ఇరువైపులా చేరి
పూజలు గావించారు. శివమహిమను, అందరికీ చాటి చెప్పారు.
శివరాత్రి వ్రతాన్ని పాటించి బ్రహ్మా విష్ణువులు పరమశివుని కృప సంపాదించారు.
!!! శివరాత్రి ఎలా ఏర్పడింది ? !!!
ప్రళయ కాలంలో బ్రహ్మ ,అతను సృష్టించిన సర్వజీవరాసులు అతలాకుతలమయ్యే
అంతిమదశలో ఉమా మహేశ్వరి పరమశివుణ్ణి ధ్యానించింది. ఆ రాత్రంతా నాలుగు జాములు
అర్చనలు ఆచరించి పరమశివుణ్ణి ఒక వరం కోరింది. " రాత్రంతా మేలుకొని నేను మీ నామస్మరణ చేసి, పూజా రాధనలు గావించినందువల్ల, మీ పవిత్ర నామం పేరిట దేవతలు,
మానవులు శివరాత్రి అనేపండుగా చేసుకోవాలి. శివరాత్రి నాడు సూర్య అస్తమయం
మొదలుకొని సూర్యోదయం వరకు ఎవరైతే పూజలు నిర్వహిస్తారో వారికి సర్వ భోగాలు
మోక్షం ప్రసాదించాలి, అనుగ్రహించండి స్వామీ " అని పరమశివుణ్ణి వేడుకుంది.
శివుడు ప్రత్యక్షమై "అందరు శివరాత్రి జరుపుకుంటారు " అని వరం ప్రసాదించాడు.
కాబట్టి మనము శివరాత్రి చేసి శివుని నామస్మరణతో ఆ నాడు గడపాలని
అందరిని కోరుతూ ....ఓం నమః శివాయ నమో నమః

మీ శక్తి ___/\___
No comments:
Post a Comment