Saturday, August 1, 2015

కొన్ని మంత్రాలు


ఉద్యోగ ప్రాప్తి అధికార ప్రాప్తికి 
1}ఓం శర్మ ణే నమః(ఉద్యోగం లో చేసే పని లో అంకిత భావానికి తృప్తికి)- 28 సార్లు
ఓం పరమాత్మనే నమః (ఉన్నతి పదవులు ఆసించేవారికి క్రీడా కారులకు స్వయం             ఉపాధి లో ఉన్నవారికీ )-28 సార్లు

ఓం  వషట్కారాయ నమః 
(ఇంటర్వ్యూ లలో సఫలం కావడానికి)-28 సార్లు
(వాక్ నుండి)

2} రాజరాజేశ్వరీ రాజ్యదాయినీ రాజ్యవల్లభా |
రాజత్-కృపా రాజపీఠ నివేశిత నిజాశ్రితాః || 134 ||
( లలితా సహస్రనామ  స్తోత్రము నుండి) 

3} వ్యవసాయో వ్యవస్థానః సంస్థాన స్థానదో ధ్రువః।
పరర్ధిః పరమస్పష్ఠ తు ష్ఠః పుష్ఠ శుభేక్షణ||42||
(విష్ణు సహస్రనామ స్తోత్రము నుండి)
                  
4} శ్రీ రాజ మాతం గ్యై నమః   
(కార్య సిద్ధి అధికారుల ఆదరణ ఉద్యోగ ప్రాప్తి)                            
(1108 సార్లు)

!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!1

ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః!! 
108 సార్లు చెప్పుకొంటే మంచిది 

ఆపదలు తొలగుటకు,మనశ్శాంతి కొరకు
1} ఓం నారసింహ వపుషే నమః     (ఆపదలో ఉన్నప్పుడు)
ఓం పుష్కరాక్షాయ నమః (కష్టాలు నుండి విముక్తి పొందడానికి)
(వాక్ నుండి- 108 సార్లు)

2}శ్రీ రామ స్తవం   (ఆపదలు తొలగుటకు, సంపదలు  కలుగుటకు )
ఆపదా మపహర్తారం దాతారం సర్వ  సంపదాం
లోకాభి రామం శ్రీ రామం భూయో  భూయో నమామ్యహం

(మనో వేదన తొలగుటకు)
రామాయ రామ భద్రాయ..రామ చంద్రాయ వేధసే
రఘునాథాయ నాథాయ..సీతాయాః పతయే నమః 

3 తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రికా |
తరుణీ తాపసారాధ్యా తనుమధ్యా తమో‌உపహా || 79 ||
(లలిత సహస్రనామ   స్తోత్రము  నుండి)

!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ  ధీ మహీ తన్నోగణపతి ప్రచోదయాత్
(ఈ మంత్రము 108  సార్లు జపించినచో సర్వ కార్యములు సిద్దించును)



విష్ణు శతనామ స్తోత్రం



1::వాసుదేవం హృషీకేశం వామనం జలశాయినం
జనార్దనం హరిం కృష్ణం శ్రీవక్షం గరుఢద్వజం 

2::వరాహం పుండరీకాక్షం నృసింహం నరకాంతకం
అవ్యక్తం శాశ్వతం విష్ణుం అనంత మజ మవ్యయం 

3::నారాయణం గదాధ్యక్షం గోవిందం కీర్తి భాజనం
గోవర్ధనోద్దరం దేవం భూధరం భువనేశ్వరం 

4::వేత్తారం యజ్ఞ పురుషం యజ్ఞేశం యజ్ఞవాహకం
చక్రపాణిం గదాపాణిం శంఖపాణిం నరోత్తమం 

5::వైకుంఠం దుష్టదమనం భూగర్భం పీతవాసనం
త్రివిక్రమం త్రికాలజ్ఞం త్రిమూర్తిం నందికేశ్వరం 

6::రామం రామం హయగ్రీవం భీమం రౌద్రం భవోద్భవం
శ్రీపతిం శ్రీధరం శ్రీశం మంగళం మంగళాయుధం 

7::దామోదరం దయోపేతం కేశవం కేశిసూదనం
వరేణ్యం వరదం విష్ణుం ఆనందం వసుదేవజం 

8::హిరణ్యరేతసం దీప్తం పురాణం పురుషోత్తమం
సకలం నిష్కళం శుద్ధం నిర్గుణం గుణశాశ్వతం 

9::హిరణ్య తనుసంకాశం సుర్యాయుత సమప్రభం
మేఘశ్యామం చతుర్బాహు కుశలం కమలేక్షణం 

10::జ్యోతిరూప మరూపం చ స్వరూపం రూపసంస్థితం
సర్వజ్ఞం సర్వరూపస్థవం సర్వేశం సర్వతో ముఖం 

11::జ్ఞానం కూటస్థ మచలం జ్ఞానప్రదం పరమం ప్రభుం
యోగీశం యోగనిష్ణాతం యోగినం యోగ రూపిణం 

12::ఈశ్వరం సర్వభూతానాం వందే భూతమయం ప్రభుం
ఇతి నామశాతం దివ్యం వైష్ణవం ఖలు పాపహం 

13::వ్యాసేన కథితం పూర్వం సర్వపాప ప్రణాశనం
యఃపఠేత్ ప్రాతరుత్థాయ స భావే ద్వైష్ణవోనరః 

14::సర్వ పాపవిశుద్ధాత్మా విష్ణు సాయుజ్య మాప్నుయాత్
చాంద్రాయణ సహస్రాణి కన్యాదాన శతాని చ 

15::గవాంలక్ష సహస్రాణి ముక్తిభాగీ భావేన్నరః
అశ్వమేధాయుతం పుణ్యం ఫలం ప్రాప్నోతి మానవః 

ఫలం::పాపనాశనం, వైకుంఠప్రాప్తి, వెయ్యి చాంద్రాయణ వ్రతాలు – వంద కన్యాదానాలూ – కోటి గోదానాలూ – ఒక అశ్వమేధం చేసిన పుణ్యం కలుగుతుంది

Monday, July 27, 2015

తొలిఏకాదశి



ఈరోజు సోమవారం
తొలిఏకాదశి
ఏ మంచిపని ప్రారంభించినా దశమి ఏకాదశులకోసం ఎదురుచూడటం ప్రజలకు అలవాటు. 
ఏడాది పొడుగునా ఉండే 24 ఏకాదశుల్లో, ఆషాఢ శుక్ల ఏకాదశి తొలి ఏకాదశిగా పరిగణిస్తారు.


పూర్వకాలంలో ఈ రోజునే సంవత్సరారంభంగా పరిగణించేవారు. 
వానకారు మొదలైతే అనారోగ్యాలు తలెత్తడం సహజం. 
శరదృతువు యమ దంష్ట్రిక (యముడి కోర). 
ఉత్తరాయణం కన్నా దక్షిణాయనంలో పండుగలూ పబ్బాలూ ఎక్కువ. 
లంఖణం పరమ ఔషధం అనే ఉపవాస దీక్షకు నాంది తొలి ఏకాదశి.

పురాణ నేపథ్యం
ఆషాఢమాసము శుక్లపక్ష ఏకాదశి నాడు
విష్ణుమూర్తి పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్ళే సందర్బాన్ని తొలిఏకాదశి గా పరిగణిస్తారు. 
స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. 
సతీ సక్కుబాయి ఈ శయన ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందింది. 
తొలిఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి, రాత్రికి జాగారం చేసి, 
మర్నాడు ద్వాదశినాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలను స్వీకరించి 
ఆ తర్వాత భోజనం చేస్తే జన్మజన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని నమ్మకం. 
ఆ రోజు యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడంటారు. దానిని ఉత్థాన ఏకాదశి అంటారు. 
ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశినే క్షీరాబ్ధి ద్వాదశి అంటారు. ఈ నాలుగు నెలల కాలాన్నీ పవిత్రంగా పరిగణించి అందరూ
చాతుర్మాస్యదీక్ష చేసేవారు. తాళజంఘుడు అనే రాక్షసుని కుమారుడగు మురాసురునితో యుద్ధంలో గెలవలేక అలసిపోయిన విష్ణువు, తన శరీరము నుంచి జనింపజేసిన కన్యక నే "ఏకాదశి" అంటారు.ఏకాదశీ వ్రతాన్ని ఆచరించే రుక్మాంగదుడు- మోహిని రూపంలో వచ్చి ఏకాదశిపూట పొందుకోరిన రంభను తిరస్కరించాడట. 
ప్రస్తుతం మఠాధిపతులూ, సన్యాసం తీసుకున్నవారు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు. 
చతుర్మాస్యదీక్ష చేపట్టినవారు నాలుగునెలలపాటు ప్రయాణాలు చేయరు. 
కామ క్రోధాదులను విసర్జిస్తారు. ఆహారం విషయంలో కొన్ని నిషేధాలు పాటిస్తారు.
జొన్న పేలాలు బెల్లం కలిపి దంచి పిండి చేస్తారు. రైతులు ఆరోజున ఖచ్చితంగా
పేలపిండి తింటారు. ఏకాదశినాడు ఉపవాస నియమం లోకంలో స్థిరపడింది.
శాంతాకారం భుజగశయనం, పద్మనాభం, సురేశం
విశ్వాకారం, గగన సదృశం మేఘవర్ణం శుభాంగం
లక్ష్మీకాంతం, కమలనయనం యోగి హృద్ధ్యానగమ్యం
వందే విష్ణుం, భవభయహరం సర్వలోకైక నాధం.
అని విష్ణుస్తోత్రం గావించుకుని 'తొలిఏకాదశి' ని గూర్చి సమీక్షగా తెలుసుకుందాం! 
ప్రతీసంవత్సరం ఆషాడ శుద్ధ ఏకాదశిని 'తొలిఏకాదశి' గా అంటారు. 
ఎందుచేతనంటే! పూర్వకాలమందు ఈ తోలిఏకాదశితోనే, సంవత్సర ప్రారంభంగా కూడ చూచేవారట! ఈ రోజును 'శయన ఏకాదశి' అనికూడా పిలుస్తారు ఎందువల్లననగా; శ్రీమహావిష్ణువు ఆరోజునుండి కార్తీకశుద్ధ ఏకాదశి వరకు యోగనిద్రలో ఉంటాడని, నాటినుండి శ్రీహరిభక్తులు కామక్రోధాధులు వర్జించి ప్రయాణాలు చేయకుండా ఒకేచోట ఉండి శ్రీహరిని అర్చిస్తూ తిరిగి కార్తీకశుద్ధ ఏకాదశి 'ఉత్థాన ఏకాదశి' వరకు ఆనాలుగు మాసములు చాతుర్మాస్య వ్రతం చేయుట కూడా మన భారతీయ సంప్రదాయములలో ఒకటి. ఆరోజు 'శ్రీహరి' శేషతల్పం పైనుండి మేల్కొంటాడు. 
ఈ చాతుర్మాస్య దీక్షను సన్యాసులు మాత్రమేకాదు. 
సంసారులు, వయో, లింగబేధము లేకుండా భక్తులందరూ దీనిని ఆచరిస్తూ ఉంటారు.
ఈ 'తొలి ఏకాదశి' నాడు "గోపద్మ వ్రతం" చేయుట ఎంతో విశిష్టమైనదిగా చెప్తారు. 
ఇంతకీ గోవును పూజించుటలో గల ఆంతర్యమేమిటో కూడా ఈ సందర్భంగా కొద్దిగా తెలుసుకుందాం!
ఈ గోమాత పూర్తిగా విరాట్ పురుషుని రూపంతో పోల్చబడింది. 
గోవునకు ముఖమునందు వేదాలు, కొమ్మలయందు హరిహరులు, కొమ్ముల చివర ఇంద్రుడు, లలాటమున ఈశ్వరుడు, కర్ణములందు అశ్వనీదేవతలు నేత్రములందు సూర్యచంద్రులు, దంతములయందు గరుడుడు, జిహ్వయందు సరస్వతి, ఉదరమునందు స్కందుడు, రోమకూపములందు ఋషులు, పూర్వభాగమునందు యముడు, పశ్చిమ భాగమునందు అగ్ని, దక్షిణభాగమున వరుణ కుబేరులు, వామభాగము నందు యక్షులు, ముఖమునందు గంధర్వులు, నాసాగ్రమందు పన్నగలు, అపానంబున సరస్వతి, గంగాతీర్థంబులు, గోమయంబున లక్ష్మీ, పాదాగ్రంబున ఖేచరులును, అంబా అంటూ అరచే అరుపులో ప్రజాపతి, స్థనములందు చతుస్సాగరములు ఉన్నట్లుగా వర్ణింపబడెను. 
కావున గోవును పూజిస్తే! సమస్త దేవతలను పూజించి నట్లేనని, సమస్త తీర్థములలో పుణ్యస్నానంచేసిన పుణ్యఫలం లభిస్తుందని 'గోమాతకు' ఇంత పూజ్యస్తానమిస్తూ, అధర్వణ వేదంలో బ్రహ్మాండపురాణంలో, మాహాభారతంలో, పద్మపురాణంలో ఇలా ఎన్నో గాధలు ఉన్నాయి.
అట్టి గోమాత నివశించే గోశాలను ఈ 'తొలిఏకాదశి' దినమందు మరింతగా శుభ్రముచేసి అలికి ముత్యాల ముగ్గులతో రంగవల్లికలను తీర్చిదిద్ది గోశాల మధ్యభాగమందు బియ్యపు పిండితో ముప్పైమూడు పద్మాల ముగ్గులు పెట్టి, శ్రీమహాలక్ష్మీ సమేత శ్రీమహావిష్ణువు ప్రతిమను ఆపద్మములపైనుంచి, వారిని విధివిధానంగా పూజించి, పద్మానికి ఒక్కొక్క "అప్పడాన్ని" వాటిపై ఉంచి ఆ అప్పడాలను వాయనాలను, దక్షిణ తాంబూలాదులలో బ్రాహ్మణుని సంతుష్టుని గావించి, గోమాతను పూజించువార్కి సకలలాభీష్టములు తప్పక నెరవేరుతాయని చెప్పబడినది. 
అలా, గోపద్మవ్రతం చెయ్యాలి.
ఇంత పుణ్యప్రదమైన తొలిఏకాదశి పర్వదినం శుభప్రదముగా జరుపుకుని పునీతులౌదాము.
rachana::padmaja sai

Tuesday, May 5, 2015

ఓం మణిద్వీప వర్ణన





ఓం మణిద్వీప వర్ణన మరియు 

1::మహాశక్తి  మణిద్వీప నివాసిని ముల్లోకాలకు  మూల  ప్రకాశిని
మణిద్వీపములో  మంత్రరూపిణి  మన మనస్సులలో కొలువైయింది

2::సుగంధ పుష్పాలెన్నో వేలు  అనంత సుందర  సువర్ణపూలు
అచంచలంబగు  మనో సుఖాలు మణిద్వీపానికి  మహానిధులు

3::లక్షల  లక్షల  లావణ్యాలు  అక్షరలక్షల  వాక్  సంపదలు
లక్షల లక్షల  లక్ష్మీపతులు  మణిద్వీపానికి  మహానిధులు

4::పారిజాత  వన  సౌగంధాలు  సురాధినాధుల  సత్సంగాలౌ
గంధర్వాదుల  గానస్వరాలు   మణిద్వీపానికి  మహానిధులు
భువనేశ్వరీ  సంకల్పమే  జనియించే  మణిద్వీపం
దేవదేవుల  నివాసము  అదియే  కైవల్యం

5::పద్మరాగములు  సువర్ణమణులు  పది  ఆమడల  పొడవున  గలవు
మధురమధురమగు  చందనసుధలు  మణిద్వీపానికి  మహానిధులు

6::అరువదినాలుగు  కళామతల్లులు  వరాలనొసగే  పదారుశక్తులు
పరివారముతో  పంచబ్రహ్మలు  మణిద్వీపానికి  మహానిధులు

7::అష్టసిద్ధులు  నవనవ నిధులు  అష్టదిక్కులూ  దిక్పాలకులు
సృష్టికర్తలు  సురలోకాలౌ మణిద్వీపానికి  మహానిధులు

8::కోటి సూర్యులు  ప్రపంచకాంతులు  కోటి చంద్రుల  చల్లని  వెలుగులు
కోటితారకల  వెలుగుజిలుగులు  మణిద్వీపానికి  మహానిధులు

9::కంచుగోడల  ప్రాకారాలు  రాగిగోడల  చతురస్రాలు
ఏడామడల  రత్నరాసులు  మణిద్వీపానికి  మహానిధులు

10::పంచామృతమయ  సరోవరాలు  పంచలోహమయ  ప్రాకారాలు 
ప్రపంచమేలే  ప్రజాధిపతులు   మణిద్వీపానికి  మహానిధులు

11::ఇంద్రనీలమణి  ఆభరణాలు వజ్రపు  కోటలు  వైఢూర్యాలు 
పుష్యరాగ మణిప్రాకారాలు  మణిద్వీపానికి  మహానిధులు

12::సప్తకోటి  ఘనమంత్రవిద్యలు సర్వశుభప్రద  ఇచ్ఛాశక్తులు 
శ్రీ  గాయత్రీ  జ్ఞానశక్తులు  మణిద్వీపానికి  మహానిధులు..భువ

13::మిలమిలలాడే  రత్నపు రాసులు  తళతళలాడే  చంద్రకాంతములు
విద్యుల్లతలు  మరకతమణులు  మణిద్వీపానికి  మహానిధులు

14::కుబేర  ఇంద్ర  వరుణదేవులు  శుభాలనొసగే   అగ్నివాయువులు
భూమిగణపతి పరివారములు  మణిద్వీపానికి  మహానిధులు

15::భక్తిజ్ఞానవైరాగ్య సిద్ధులు  పంచభూతములు  పంచశక్తులు
సప్తఋషులు  నవగ్రహాలు  మణిద్వీపానికి  మహానిధులు

16::కస్తూరి  మల్లిక  కుందవనాలు సూర్యకాంతి  శిలమహాగ్రహాలు
ఆరు ఋతువులు  చతుర్వేదాలు  మణిద్వీపానికి  మహానిధులు

17::మంత్రిణి  దండిణి  శక్తిసేనలు  కాళి కరాళి  సేనాపతులు
ముప్పదిరెండు  మహాశక్తులు మణిద్వీపానికి  మహానిధులు

18::సువర్ణరజిత సుందరగిరులు  అనంతదేవి  పరిచారికలు
గోమేధికమణి  నిర్మిత  గుహలు  మణిద్వీపానికి  మహానిధులు

19::సప్తసముద్రములనంత నిధులు   యక్షకిన్నెర కింపురుషాదులు
నానాజగములు  నదీనదములు మణిద్వీపానికి  మహానిధులు

20::మానవ మాధవ దేవగణములు కామధేనువు  కల్పతరువులు
సృష్టిస్థితిలయా కారణమూర్తులు మణిద్వీపానికి  మహానిధులు

21::కోటి ప్రకృతుల  సౌందర్యాలు  సకలవేదములు  ఉపనిషత్తులు
పదారురేకల  పద్మశక్తులు  మణిద్వీపానికి  మహానిధులు

22::దివ్యఫలముల  దివ్యాస్త్రములు  దివ్యపురుషులు  ధీరమాతలు
దివ్యజగములు  దివ్యశక్తులు మణిద్వీపానికి  మహానిధులు

23::శ్రీ  విఘ్నేశ్వర  కుమారస్వాములు జ్ఞానముక్తి  ఏకాంతభవనములు
మణినిర్మితమగు  మండపాలు  మణిద్వీపానికి  మహానిధులు

24::పంచభూతములు  యాజమాన్యాలు  వ్యాళసాలం  అనేకశక్తులు
సంతాన  వృక్షసముదాయాలు  మణిద్వీపానికి  మహానిధులు

25::చింతామణులు  నవరాత్రులు నూరామడల  వజ్రరాసులు 
వసంత  వనములు  గరుడపచ్చలు మణిద్వీపానికి  మహానిధులు

26::దుఃఖము  తెలియని  దేవీసేవలు  నటనాట్యాలు  సంగీతాలు
ధనకనకాలు  పురుషార్ధాలు మణిద్వీపానికి  మహానిధులు

27::పదునాల్గు , లోకాలన్నిటిపైనా సర్వలోకమను  లోకము  గలదు
సర్వలోకమే  ఈ  మణిద్వీపము సర్వేశ్వరికది  శాశ్వత స్థానం

28::చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల  మంచముపైన
మహాదేవుడు  భువనేశ్వరితో  నివసిస్తాడు మణిద్వీపములో

29::మణిగణ ఖచిత  ఆభరణాలు చింతామణి  పరమేశ్వరి  దాల్చి
సౌందర్యానికి  సౌందర్యముగా  అగుపడుతుంది  మణిద్వీపములో

30::పరదేవతను  నిత్యము  కొలిచి  మనసర్పించి  అర్చించినచో  
అపారధనము  సంపదలిచ్చి  మణిద్వీపేశ్వరి  దీవిస్తుంది..2

31::నూతనగృహములు  కట్టినవారు మణిద్వీపవర్ణన  తొమ్మిదిసార్లు
చదివిన  చాలు  అంతా  శుభమే అష్టసంపదల  తులతూగేరు 

32::శివ కవితేశ్వరి  శ్రీ చక్రేశ్వరి మణిద్వీపవర్ణన  చదివిన చోట 
తిష్టవేసుకొని  కూర్చొనునంటా  కోటి శుభాలను  సమకూర్చుకొనుటకై
దేవదేవల  నివాసము అదియే  కైవల్యం...భు 

మంగళహారతి

శ్రీ  త్రిపురసుందరికి  మణిద్వీపవాసినికి 
మంగళమ్  జయమంగళమ్  నిత్య  శుభమంగళమ్   
ఓంకార  రూపిణికి  హ్రీంకార వాసినికి  శ్రీం ,బీజవాహినికి
మంగళమ్  జయమంగళమ్  నిత్య శుభమంగళమ్  
ఆపదలు  బాపేటి  సంపదలనొసగేటి  శ్రీనగరవాసినికి
మంగళమ్  జయమంగళమ్  నిత్య  శుభమంగళమ్
వేదాలు  నాదాలు  శిరసొంచి  మొక్కేటి శ్రీ రత్నసింహాసినికి
మంగళమ్ జయమంగళమ్ నిత్య  శుభమంగళమ్ 

Saturday, April 25, 2015

గంగా స్తోత్రం


ఆది శంకరుల గంగా స్తోత్రం

1::దేవి సురేశ్వరి భగవతి గంగే త్రిభువనతారిణి తరళతరంగే  
శంకరమౌళివిహరిణి విమలే మమ మతిరాస్తాం తవ పదకమలే  

ప్రకాశించేదానా! దేవతలకు దేవతా!పూజ్యురాలా! ఓ గంగాదేవీ! మూడు లోకములను తరింపచేయుదానా! ప్రకాశించే తరంగములు కలదానా!
శుభాలు కలిగించే శంకరుని కొప్పుపై విహరించుదానా! పవిత్రమైనదానా! నీ పాద పద్మములయందు ఎప్పుడు నా బుద్ధి నిలిచి యుండుగాక!

2::భాగీరథిసుఖదాయిని మాతస్తవ జలమహిమా నిగమే ఖ్యాతః  
నాహం జానే తవ మహిమానం పాహి కృపామయి మామ జ్ఞానమ్

అందరికీ సుఖాన్ని కలిగించే భాగీరథి (భగీరథునిచే భూమికి తేబడినది) అని పిలువబడే గంగమ్మా! నీ పవిత్రమైన నీటి మహిమ వేదములలో వర్ణింపబడినది.
నీ యొక్క మహిమను నేను పూర్తిగా తెలుసుకోలేను. దయ కలిగిన దానా ! నా అజ్ఞానమును క్షమించు.

3::హరిపదపాద్యతరంగిణి గంగే హిమవిధుముక్తాధవళతరంగే 
దూరీకురు మమ దుష్కృతిభారం కురు కృపయా భవసాగరపారమ్

గంగా మాతా! నువ్వు శ్రీహరి పాదములనుంచి పుట్టావు. నీ స్వచ్చమైన తరంగాలు , తెల్లటి మంచును, చంద్రుని, ముత్యాలను పోలిఉంటాయి. పాపభారాన్ని నానుంచి తొలగించు.ఈ సంసార సాగరాన్ని తరింపచేయి

4::తవ జలమమలం యేన నిపీతం పరమపదం ఖలు తేన గృహీతమ్  
మాతర్గంగే త్వయి యో భక్తః కిల తం ద్రష్టుం న యమః శక్తః

గంగా మాతా! నీ స్వచ్చమైన నీటిని త్రాగినవాడు తప్పకుండా మోక్షాన్ని పొందుతాడు.
నీ భక్తుడిని చూసే శక్తి యమునికి ఉండదు. ( గంగాదేవి భక్తుడు యమలోకానికి వెళ్లడని భావము)

5::పతితోద్ధారిణి జాహ్నవి గంగే ఖండిత గిరివరమండిత భంగే 
భీష్మజనని హే మునివరకన్యే పతితనివారిణి త్రిభువన ధన్యే 

గంగా మాతా! అధోగతిని పొందినవారిని నువ్వు ఉధ్ధరిస్తావు. హిమలయ పర్వతములనుండి ప్రవహించే సం దర్భంలో పర్వతాగ్రాలను నువ్వు ఖండిస్తూ, ఒక రకమైన అలంకారాన్ని ఆ పర్వతాలకు ఇస్తుంటావు.
భీష్మునికి తల్లీ ! జహ్ను ముని కూతురా ! జీవితంలో పడిన వారిని, పదవి చెడినవారిని ఉద్ధరిస్తావు. మూడు లోకాలను ధన్యము చేస్తావు.

6::కల్పలతామివ ఫలదాం లోకే ప్రణమతి యస్త్వాం న పతతి శోకే  
పారావారవిహారిణి గంగే విముఖయువతి కృతతరలాపాంగే  

ఓ గంగా మాతా! నువ్వు కల్పలత వలె లోకాలకు ఫలాలను అందిస్తుంటావు. నీకు నమస్కరించినవాడు ఏనాడు శోకాన్ని పొందడు.
అనురాగముతో కదిలే చూపులు కలిగిన యువతి చూపులవలె -నువ్వు సముద్రములో కలిసేటప్పుడు (విహరించేటప్పుడు) నీ తరంగాలు ఉంటాయి.

7::తవ చేన్మాతః స్రోతః స్నాతః పునరపి జఠరే సోపి న జాతః 
నరకనివారిణి జాహ్నవి గంగే కలుషవినాశిని మహిమోత్తుంగే 

ఓ గంగా మాతా! ఒక్కసారి నీలో స్నానము చేసిన వాడు , మళ్ళీ పునర్జన్మను పొందడు
నువ్వు నరకాన్ని నివారించేదానివి.పాపాలను నశింపచేసే దానివి. ఉన్నతమైన మహిమలు కలదానివి.

8::పునరసదంగే పుణ్యతరంగే జయ జయ జాహ్నవి కరుణాపాంగే 
ఇంద్రముకుటమణిరాజితచరణే సుఖదే శుభదే భృత్యశరణ్యే 

ఓ జాహ్నవీ దేవీ ! నీ కు జయము. జయము. నువ్వు ఈ మలిన యుక్తమైన శరీరాన్ని నీ తరంగాలతో పవిత్రము చేస్తావు.
నీ పాదాలు ఇంద్ర కిరీటములోని మణుల కాంతులతో అలంకరించబడి ఉంటాయి. సేవా భావంతో నీకు శరణన్నవానికి సుఖాన్ని ఇస్తావు. శుభాన్ని ఇస్తావు.

9::రోగం శోకం తాపం పాపం హర మే భగవతి కుమతికలాపమ్ 
త్రిభువనసారే వసుధాహారే త్వమసి గతిర్మమ ఖలు సంసారే 

ఓ పూజ్యురాలైన గంగా మాతా! నా రోగాన్ని, విచారాలను, పాపాలను, చెడు భావాలను తొలగించు.
నువ్వు మూడు లోకాలకు సార భూతమైన దానివి. ఈ భూమికి నువ్వు ఒక హారమువంటి దానివి.ఈ సంసారములో నువ్వే నాకు గతివై ఉన్నావు.

10::అలకానందే పరమానందే కురు కరుణామయి కాతరవంద్యే  
తవ తటనికటే యస్య నివాసః ఖలు వైకుంఠే తస్య నివాసః 

ఓ అలకానందా ! గంగాదేవీ! పరమానందము ఇచ్చేదానా ! భయపడిన వారిచే నమస్కరింపబడేదానా! నా యందు దయ యుంచు.
నీ తీరములో ఎవడు ఉంటాడో, వాడు వైకుంఠములో ఉన్నట్లే.
విశేషాలు
గంగ హిమాలయాలలో గంగోత్రి వద్ద ప్రారంభమై దేవప్రయాగ వద్ద అలకానంద ఉపనదితో కలిసి ఉత్తరాంచల్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల మీదుగా 2,525 కి.మీ. ప్రయాణించి కోల్ కత వద్ద గంగాసాగర్ లో (బంగాళఖాతం) కలుస్తున్నది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో గంగ దేశంలోని 40 శాతం మందికి త్రాగునీరు అందిస్తున్నది. 50 కోట్లమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా జీవనోపాధిని కలిగిస్తున్నది. అటువంటి గంగలోనికి నిత్యం 270 కోట్ల లీటర్ల కాలుష్య జలం చేరుతూ గంగ పవిత్రతకు భంగం కలిగిస్తున్నది.(అంతర్జాల సౌజన్యం)

11::వరమిహ నీరే కమఠో మీనః కిం వా తీరే శరటః క్షీణః 
అథవాశ్వపచో మలినో దీనస్తవ న హి దూరే నృపతికులీనః 

ఓ గంగా మాతా! నీ నీటిలో తాబేలుగా కాని, చేపగా కాని, నీ నీటి ఒడ్డున అల్పమైన ఊసరవెల్లిగా కాని జీవించుట ఎంతో అదృష్టము ఉంటే కాని కలుగదు.
పవిత్రమైన నీ నది ఒడ్డున కుక్కను వండుకొని తినే శ్వపచుడు, నీకు దూరంగా జీవించే ఉత్తమ కులీనుడైన రాజు కంటె గొప్పవాడు.

12::భో భువనేశ్వరి పుణ్యే ధన్యే దేవి ద్రవమయి మునివరకన్యే  
గంగాస్తవమిమమమలం నిత్యం పఠతి నరో యః స జయతి సత్యమ్ 

ప్రపంచానికి ఈశ్వరీ ! ఓ పుణ్యురాలా ! ధన్యురాలా! దేవీ! ద్రవ రూపములో మహా ముని జహ్ను మహర్షి కుమార్తె గా మారిన దానా !
పవిత్రమైన ఈ గంగాస్తవమును ప్రతిరోజూ ఎవడు చదువుతాడో, అతనికి తప్పక జయము సిద్ధిస్తుంది.

13::యేషాం హృదయే గంగా భక్తిస్తేషాం భవతి సదా సుఖముక్తిః  
మధురాకంతా పంఝటికాభిః పరమానందకలితలలితాభిః 

ఎవరి హృదయములో గంగా భక్తి ఉంటుందో, అతడు తప్పకుండా స్వేచ్చ యొక్క ఆనందాన్ని హృదయములో అనుభవిస్తాడు.
పంఝటికా చందస్సు లో (?) మధురాహ్లాదముగా రచింపబడిన ఈ గంగా స్తోత్రము పరమానంద సంభరితమైనది.

14::గంగాస్తోత్రమిదం భవసారం వాంఛితఫలదం విమలం సారమ్
శంకరసేవక శంకర రచితం పఠతి సుఖీః తవ ఇతి చ సమాప్తః 

ఈ సంసారములోని సారము ఈ గంగా స్తోత్రము. ఈ స్తోత్రాన్ని భక్తితో చదువుకొన్నవారికి కోరిన కోరికలు నెరవేరుతాయి.ఇది స్వచ్చమైనది.
శంకరుని సేవకుడైన శంకరునిచే ఈ స్తోత్రము రచింపబడినది.ఈ స్తోత్రము ఆసాంతము చదివిన వాడు సుఖము పొందుతాడు. అందరికి జయాన్ని కోరుతూ ఇంతటితో ఈ స్తోత్రము ముగిసినది.

Friday, April 3, 2015

Shiradi BaBaa Bhajans



Program::Bhajan Sandhya

Dhyaana-Muulam Gurur-Muurtih
Puujaa-Muulam Gurur-Padam |
Mantra-Muulam Gurur-Vaakyam
Mokssa-Muulam Guruur-Krpaa ||

Aruna Ramana Sri Guru Deva
Sesha Ramana Sadguru Deva
Bhavabhaya Harana Sri Sai Deva
Sri Sai Deva Sri Sai Deva
Guru Hey Satjith Ananda Deva
Ananda Deva Sri Sai Deva

జ్ఞాన మూలం..గురు మూర్తిం
పూజా మూలం..గురుర్ పాదం
మంత్ర మూలం..గురుర్ వాఖ్యం
మోక్ష మూలం..గురూర్ కృపా

అరుణా రమణ శ్రీ గురు దేవా
శేషా రమణ సద్గురు దేవా
భవభయ హరణా శ్రీ సాయి దేవా
శ్రీ సాయి దేవా..శ్రీ సాయి దేవా
భవభయ హరణా శ్రీ సాయి దేవా
శ్రీ సాయి దేవా  శ్రీ సాయి దేవా
గురు హేయ్ సత్‌జిత్ ఆనంద దేవా
ఆనంద దేవా శ్రీ సాయి దేవా  

Sunday, March 15, 2015

దేవీ మహాత్మ్యమ్ దుర్గా సప్తశతి చతుర్థో‌உధ్యాయః



శక్రాదిస్తుతిర్నామ చతుర్ధో‌உధ్యాయః ||

ధ్యానం::
1::కాలాభ్రాభాం కటాక్షైర్ అరి కుల భయదాం మౌళి బద్ధేందు రేఖాం
శంఖ చక్ర కృపాణం త్రిశిఖ మపి కరైర్ ఉద్వహంతీం త్రిన్త్రామ్ 
సింహ స్కందాధిరూఢాం త్రిభువన మఖిలం తేజసా పూరయంతీం
ధ్యాయేద్ దుర్గాం జయాఖ్యాం త్రిదశ పరివృతాం సేవితాం సిద్ధి కామైః 

ఋషిరువాచ::

2::శక్రాదయః సురగణా నిహతే‌உతివీర్యే
తస్మిందురాత్మని సురారిబలే చ దేవ్యా  
తాం తుష్టువుః ప్రణతినమ్రశిరోధరాంసా
వాగ్భిః ప్రహర్షపులకోద్గమచారుదేహాః  

3::దేవ్యా యయా తతమిదం జగదాత్మశక్త్యా
నిఃశేషదేవగణశక్తిసమూహమూర్త్యా 
తామంబికామఖిలదేవమహర్షిపూజ్యాం 
భక్త్యా నతాః స్మ విదధాతుశుభాని సా నః 

4::యస్యాః ప్రభావమతులం భగవాననంతో
బ్రహ్మా హరశ్చ నహి వక్తుమలం బలం చ  
సా చండికా‌உఖిల జగత్పరిపాలనాయ
నాశాయ చాశుభభయస్య మతిం కరోతు  

5::యా శ్రీః స్వయం సుకృతినాం భవనేష్వలక్ష్మీః
పాపాత్మనాం కృతధియాం హృదయేషు బుద్ధిః  
శ్రద్థా సతాం కులజనప్రభవస్య లజ్జా
తాం త్వాం నతాః స్మ పరిపాలయ దేవి విశ్వమ్ 

6::కిం వర్ణయామ తవరూప మచింత్యమేతత్
కించాతివీర్యమసురక్షయకారి భూరి  
కిం చాహవేషు చరితాని తవాత్భుతాని
సర్వేషు దేవ్యసురదేవగణాదికేషు   

7::హేతుః సమస్తజగతాం త్రిగుణాపి దోషైః
న ఙ్ఞాయసే హరిహరాదిభిరవ్యపారా  
సర్వాశ్రయాఖిలమిదం జగదంశభూతం
అవ్యాకృతా హి పరమా ప్రకృతిస్త్వమాద్యా  

8::యస్యాః సమస్తసురతా సముదీరణేన
తృప్తిం ప్రయాతి సకలేషు మఖేషు దేవి  
స్వాహాసి వై పితృ గణస్య చ తృప్తి హేతు
రుచ్చార్యసే త్వమత ఏవ జనైః స్వధాచ 

9::యా ముక్తిహేతురవిచింత్య మహావ్రతా త్వం
అభ్యస్యసే సునియతేంద్రియతత్వసారైః  
మోక్షార్థిభిర్మునిభిరస్తసమస్తదోషై
ర్విద్యా‌உసి సా భగవతీ పరమా హి దేవి 

10::శబ్దాత్మికా సువిమలర్గ్యజుషాం నిధానం
ముద్గీథరమ్యపదపాఠవతాం చ సామ్నామ్  
దేవీ త్రయీ భగవతీ భవభావనాయ
వార్తాసి సర్వ జగతాం పరమార్తిహంత్రీ 

11::మేధాసి దేవి విదితాఖిలశాస్త్రసారా
దుర్గా‌உసి దుర్గభవసాగరసనౌరసంగా  
శ్రీః కైట భారిహృదయైకకృతాధివాసా
గౌరీ త్వమేవ శశిమౌళికృత ప్రతిష్ఠా 

12::ఈషత్సహాసమమలం పరిపూర్ణ చంద్ర
బింబానుకారి కనకోత్తమకాంతికాంతమ్  
అత్యద్భుతం ప్రహృతమాత్తరుషా తథాపి
వక్త్రం విలోక్య సహసా మహిషాసురేణ  

13::దృష్ట్వాతు దేవి కుపితం భ్రుకుటీకరాళ
ముద్యచ్ఛశాంకసదృశచ్ఛవి యన్న సద్యః  
ప్రాణాన్ ముమోచ మహిషస్తదతీవ చిత్రం
కైర్జీవ్యతే హి కుపితాంతకదర్శనేన  

14::దేవిప్రసీద పరమా భవతీ భవాయ
సద్యో వినాశయసి కోపవతీ కులాని  
విఙ్ఞాతమేతదధునైవ యదస్తమేతత్
న్నీతం బలం సువిపులం మహిషాసురస్య  

15::తే సమ్మతా జనపదేషు ధనాని తేషాం
తేషాం యశాంసి న చ సీదతి ధర్మవర్గః  
ధన్యాస్త‌ఏవ నిభృతాత్మజభృత్యదారా
యేషాం సదాభ్యుదయదా భవతీ ప్రసన్నా 

16::ధర్మ్యాణి దేవి సకలాని సదైవ కర్మాని
ణ్యత్యాదృతః ప్రతిదినం సుకృతీ కరోతి  
స్వర్గం ప్రయాతి చ తతో భవతీ ప్రసాదా
ల్లోకత్రయే‌உపి ఫలదా నను దేవి తేన 

17::దుర్గే స్మృతా హరసి భీతి మశేశ జంతోః
స్వస్థైః స్మృతా మతిమతీవ శుభాం దదాసి  
దారిద్ర్యదుఃఖభయహారిణి కా త్వదన్యా
సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్తా  

18::ఏభిర్హతైర్జగదుపైతి సుఖం తథైతే
కుర్వంతు నామ నరకాయ చిరాయ పాపమ్  
సంగ్రామమృత్యుమధిగమ్య దివంప్రయాంతు
మత్వేతి నూనమహితాన్వినిహంసి దేవి  

19::దృష్ట్వైవ కిం న భవతీ ప్రకరోతి భస్మ
సర్వాసురానరిషు యత్ప్రహిణోషి శస్త్రమ్  
లోకాన్ప్రయాంతు రిపవో‌உపి హి శస్త్రపూతా
ఇత్థం మతిర్భవతి తేష్వహి తే‌உషుసాధ్వీ  

20::ఖడ్గ ప్రభానికరవిస్ఫురణైస్తధోగ్రైః
శూలాగ్రకాంతినివహేన దృశో‌உసురాణామ్ 
యన్నాగతా విలయమంశుమదిందుఖండ
యోగ్యాననం తవ విలోక యతాం తదేతత్  

21::దుర్వృత్త వృత్త శమనం తవ దేవి శీలం
రూపం తథైతదవిచింత్యమతుల్యమన్యైః  
వీర్యం చ హంతృ హృతదేవపరాక్రమాణాం
వైరిష్వపి ప్రకటితైవ దయా త్వయేత్థమ్ 

22::కేనోపమా భవతు తే‌உస్య పరాక్రమస్య
రూపం చ శతృభయ కార్యతిహారి కుత్ర  
చిత్తేకృపా సమరనిష్టురతా చ దృష్టా
త్వయ్యేవ దేవి వరదే భువనత్రయే‌உపి 

23::త్రైలోక్యమేతదఖిలం రిపునాశనేన
త్రాతం త్వయా సమరమూర్ధని తే‌உపి హత్వా  
నీతా దివం రిపుగణా భయమప్యపాస్తం
అస్మాకమున్మదసురారిభవం నమస్తే 

Arogyaniki Sotram
24::శూలేన పాహి నో దేవి పాహి ఖడ్గేన చాంభికే  
ఘంటాస్వనేన నః పాహి చాపజ్యానిస్వనేన చ  

25::ప్రాచ్యాం రక్ష ప్రతీచ్యాం చ చండికే రక్ష దక్షిణే  
భ్రామణేనాత్మశూలస్య ఉత్తరస్యాం తథేశ్వరీ  

26::సౌమ్యాని యాని రూపాణి త్రైలోక్యే విచరంతితే  
యాని చాత్యంత ఘోరాణి తైరక్షాస్మాంస్తథాభువమ్ 

27::ఖడ్గశూలగదాదీని యాని చాస్త్రాణి తే‌உంబికే 
కరపల్లవసంగీని తైరస్మాన్రక్ష సర్వతః  

28::ఋషిరువాచ 

29::ఏవం స్తుతా సురైర్దివ్యైః కుసుమైర్నందనోద్భవైః  
అర్చితా జగతాం ధాత్రీ తథా గంధాను లేపనైః  

30::భక్త్యా సమస్తైస్రి శైర్దివ్యైర్ధూపైః సుధూపితా  
ప్రాహ ప్రసాదసుముఖీ సమస్తాన్ ప్రణతాన్ సురాన్ 

31::దేవ్యువాచ 

32::వ్రియతాం త్రిదశాః సర్వే యదస్మత్తో‌உభివాఞ్ఛితమ్  

33::దేవాఉవాచ

34::భగవత్యా కృతం సర్వం న కించిదవశిష్యతే  
యదయం నిహతః శత్రు రస్మాకం మహిషాసురః 

35::యదిచాపి వరో దేయ స్త్వయా‌உస్మాకం మహేశ్వరి  
సంస్మృతా సంస్మృతా త్వం నో హిం సేథాఃపరమాపదః 

36::యశ్చ మర్త్యః స్తవైరేభిస్త్వాం స్తోష్యత్యమలాననే  
తస్య విత్తర్ద్ధివిభవైర్ధనదారాది సంపదామ్  

37::వృద్దయే‌உ స్మత్ప్రసన్నా త్వం భవేథాః సర్వదాంభికే  

38::ఋషిరువాచ 

39::ఇతి ప్రసాదితా దేవైర్జగతో‌உర్థే తథాత్మనః  
తథేత్యుక్త్వా భద్రకాళీ బభూవాంతర్హితా నృప  

40::ఇత్యేతత్కథితం భూప సంభూతా సా యథాపురా  
దేవీ దేవశరీరేభ్యో జగత్ప్రయహితైషిణీ  

41::పునశ్చ గౌరీ దేహాత్సా సముద్భూతా యథాభవత్  
వధాయ దుష్ట దైత్యానాం తథా శుంభనిశుంభయోః  

42::రక్షణాయ చ లోకానాం దేవానాముపకారిణీ  
తచ్ఛృ ణుష్వ మయాఖ్యాతం యథావత్కథయామితే 
హ్రీమ్ ఓం 

::::జయ జయ శ్రీ మార్కండేయ పురాణే సావర్నికే మన్వంతరే 
దేవి మహత్మ్యే శక్రాదిస్తుతిర్నామ చతుర్ధో‌உధ్యాయః సమాప్తమ్ ::::

ఆహుతి
హ్రీం జయంతీ సాంగాయై సాయుధాయై సశక్తికాయై సపరివారాయై సవాహనాయై శ్రీ మహాలక్ష్మ్యై లక్ష్మీ బీజాదిష్టాయై మహాహుతిం సమర్పయామి నమః స్వాహా