Sunday, October 9, 2011

శ్రీ లక్ష్మీ అశోత్తర శత నామ స్తోత్రము






:::దేవ్యువాచ:::

దేవదేవ! మహాదేవ! త్రికాలఙ్ఞ! మహేశ్వర!
కరుణాకర దేవేశ! భక్తానుగ్రహకారక!
అష్టోత్తర శతం లక్ష్మ్యాః శ్రోతుమిచ్ఛామి తత్త్వతః!

:::ఈశ్వర ఉవాచ:::

దేవి! సాధు మహాభాగే మహాభాగ్య ప్రదాయకమ్
సర్వైశ్వర్యకరం పుణ్యం సర్వపాప ప్రణాశనమ్

సర్వదారిద్ర్య శమనం శ్రవణాద్భుక్తి ముక్తిదమ్
రాజవశ్యకరం దివ్యం గుహ్యాద్-గుహ్యతరం పరమ్

దుర్లభం సర్వదేవానాం చతుష్షష్టి కళాస్పదమ్
పద్మాదీనాం వరాంతానాం నిధీనాం నిత్యదాయకమ్

సమస్త దేవ సంసేవ్యమ్ అణిమాద్యష్ట సిద్ధిదమ్
కిమత్ర బహునోక్తేన దేవీ ప్రత్యక్షదాయకమ్

తవ ప్రీత్యాద్య వక్ష్యామి సమాహితమనాశ్శృణు
అష్టోత్తర శతస్యాస్య మహాలక్ష్మిస్తు దేవతా

క్లీం బీజ పదమిత్యుక్తం శక్తిస్తు భువనేశ్వరీ
అంగన్యాసః కరన్యాసః స ఇత్యాది ప్రకీర్తితః

:::ధ్యానమ్:::

వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం
హస్తాభ్యామభయప్రదాం మణిగణైః నానావిధైః భూషితామ్

భక్తాభీష్ట ఫలప్రదాం హరిహర బ్రహ్మాధిభిస్సేవితాం
పార్శ్వే పంకజ శంఖపద్మ నిధిభిః యుక్తాం సదా శక్తిభిః

సరసిజ నయనే సరోజహస్తే ధవళ తరాంశుక గంధమాల్య శోభే
భగవతి హరివల్లభే మనోఙ్ఞే త్రిభువన భూతికరి ప్రసీదమహ్యమ్

1::ఓం ప్రకృతిం, వికృతిం, విద్యాం, సర్వభూత హితప్రదామ్
శ్రద్ధాం, విభూతిం, సురభిం, నమామి పరమాత్మికామ్

2::వాచం, పద్మాలయాం, పద్మాం, శుచిం, స్వాహాం, స్వధాం, సుధామ్
ధన్యాం, హిరణ్యయీం, లక్ష్మీం, నిత్యపుష్టాం, విభావరీమ్

3::అదితిం చ, దితిం, దీప్తాం, వసుధాం, వసుధారిణీమ్
నమామి కమలాం, కాంతాం, క్షమాం, క్షీరోద సంభవామ్

4::అనుగ్రహపరాం, బుద్ధిం, అనఘాం, హరివల్లభామ్
అశోకా,మమృతాం దీప్తాం, లోకశోక వినాశినీమ్

5::నమామి ధర్మనిలయాం, కరుణాం, లోకమాతరమ్
పద్మప్రియాం, పద్మహస్తాం, పద్మాక్షీం, పద్మసుందరీమ్

6::పద్మోద్భవాం, పద్మముఖీం, పద్మనాభప్రియాం, రమామ్
పద్మమాలాధరాం, దేవీం, పద్మినీం, పద్మగంధినీమ్

7::పుణ్యగంధాం, సుప్రసన్నాం, ప్రసాదాభిముఖీం, ప్రభామ్
నమామి చంద్రవదనాం, చంద్రాం, చంద్రసహోదరీమ్

8::చతుర్భుజాం, చంద్రరూపాం, ఇందిరా,మిందుశీతలామ్
ఆహ్లాద జననీం, పుష్టిం, శివాం, శివకరీం, సతీమ్

9::విమలాం, విశ్వజననీం, తుష్టిం, దారిద్ర్య నాశినీమ్
ప్రీతి పుష్కరిణీం, శాంతాం, శుక్లమాల్యాంబరాం, శ్రియమ్

10::భాస్కరీం, బిల్వనిలయాం, వరారోహాం, యశస్వినీమ్
వసుంధరా, ముదారాంగాం, హరిణీం, హేమమాలినీమ్

11::ధనధాన్యకరీం, సిద్ధిం, స్రైణసౌమ్యాం, శుభప్రదామ్
నృపవేశ్మ గతానందాం, వరలక్ష్మీం, వసుప్రదామ్

12::శుభాం, హిరణ్యప్రాకారాం, సముద్రతనయాం, జయామ్
నమామి మంగళాం దేవీం, విష్ణు వక్షఃస్థల స్థితామ్

13::విష్ణుపత్నీం, ప్రసన్నాక్షీం, నారాయణ సమాశ్రితామ్
దారిద్ర్య ధ్వంసినీం, దేవీం, సర్వోపద్రవ వారిణీమ్

14::నవదుర్గాం, మహాకాళీం, బ్రహ్మ విష్ణు శివాత్మికామ్
త్రికాలఙ్ఞాన సంపన్నాం, నమామి భువనేశ్వరీమ్

15::లక్ష్మీం క్షీరసముద్రరాజ తనయాం శ్రీరంగధామేశ్వరీమ్
దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురామ్
శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవద్-బ్రహ్మేంద్ర గంగాధరామ్
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియామ్

16::మాతర్నమామి! కమలే! కమలాయతాక్షి!
శ్రీ విష్ణు హృత్-కమలవాసిని! విశ్వమాతః!
క్షీరోదజే కమల కోమల గర్భగౌరి!
లక్ష్మీ! ప్రసీద సతతం సమతాం శరణ్యే !

17::త్రికాలం యో జపేత్ విద్వాన్ షణ్మాసం విజితేంద్రియః
దారిద్ర్య ధ్వంసనం కృత్వా సర్వమాప్నోత్-యయత్నతః
దేవీనామ సహస్రేషు పుణ్యమష్టోత్తరం శతమ్
యేన శ్రియ మవాప్నోతి కోటిజన్మ దరిద్రతః

18::భృగువారే శతం ధీమాన్ పఠేత్ వత్సరమాత్రకమ్
అష్టైశ్వర్య మవాప్నోతి కుబేర ఇవ భూతలే
దారిద్ర్య మోచనం నామ స్తోత్రమంబాపరం శతమ్
యేన శ్రియ మవాప్నోతి కోటిజన్మ దరిద్రతః

19::భుక్త్వాతు విపులాన్ భోగాన్ అంతే సాయుజ్యమాప్నుయాత్
ప్రాతఃకాలే పఠేన్నిత్యం సర్వ దుఃఖోప శాంతయే
పఠంతు చింతయేద్దేవీం సర్వాభరణ భూషితామ్

:::ఇతి శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం సంపూర్ణమ్:::

శ్రీ నవగ్రహ పీడాహర స్తోత్రం




గ్రహాణామాది రాదిత్యోలోక రక్షణ కారకః
విషయ స్థాన సంభూతాం పీడాం హరతుమే రవి:
రోహిణీ శస్సుధామూర్తి స్సుధాగాత్రస్సురాళనః

భూమిపుత్రో మహాతేజా జగతాం భయకృత్నదా
వృష్టికృదృష్టి హర్తాచ పీడాం హరతు మేకుజః

ఉత్పాత్రూపోజగతాం చంద్రపుత్రో మహాద్యుతిః
సూర్యప్రియకరో విద్వాన్ పీడాం హరతుమే బుధః

దేవమంత్రీ విశాలాక్షః సదాలోకహితేరహః
అనేక శిష్య సంపూర్ణః పీడాం హరతుమే గురుః

దైత్యమంత్రీ గురుస్తేషాం ప్రాణదశ్చమహామతిః
ప్రభుస్తారాగ్రహాణాంచ పీడాం హరతుమే భ్రుగుః

సూర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్ష శివప్రియః
మందచారః ప్రసన్నాత్మా పీడాం హరతుమే శనిః

మహాశ్రీరామ మహావక్త్రో దీర్ఘదంస్త్రో మహాబలః
అతనుశ్చోర్ధ్వకేశశ్చ పీడాం హరతుమే శిఖీ

అనేక రూప్వర్వైశ్చ శతశో ధసహస్రశః
ఉత్పాతరుజోజగతాం పీడాం హరతుమే తమః

(ప్రతిరోజూ ఈ నవగ్రహ పీడా పరిహార స్తోత్రాన్ని ఉదయాన్నే తొమ్మిదిసార్లు పఠిస్తే గ్రహపీడ తొలగి, కార్యసిద్ధి కలుగుతుంది.)

Wednesday, October 5, 2011

గోవుకు గడ్డి పెట్టేటప్పుడు ఆహారాన్ని ఇచ్చేటప్పుడు శ్లోక౦

















గోవుకు గడ్డి పెట్టేటప్పుడు ఆహారాన్ని ఇచ్చేటప్పుడు శ్లోక౦

గోవుకు గడ్డి పెట్టేటప్పుడు, తగిన ఆహారాన్ని ఇచ్చేటప్పుడు ఈ శ్లోకాన్ని పఠి౦చడ౦ శుభకర౦.

ప౦చభూతశివే! పుణ్యే! పవిత్రే! సూర్య స౦భవే!
ప్రతీచ్ఛేమ౦ మయాదత్త౦ సౌరభేయి! నమోస్తుతే!!

ప౦చ భూతాలకు శుభాన్ని కలిగి౦చే పుణ్యస్వరూపిణీ! పవిత్రురాలా!
సూర్యుని ను౦డి కలిగినదానా! (సౌరశక్తిలోని దివ్యత్వ౦ గోవులో ఉన్నదని భావ౦). 
నేనిస్తున్న ఈ ద్రవ్యాన్ని స్వీకరి౦చు. సురభీ వ౦శ౦లో కలిగిన తల్లీ! నీకు నమస్కారము.

దేవీ భాగవతా౦ర్గత ఇ౦ద్ర కృత లక్ష్మీస్తవం






















దేవీ భాగవతా౦ర్గత ఇ౦ద్ర కృత లక్ష్మీస్తవం

1::నమః కమల వాసిన్యై నారాయణ్యై నమోనమః
కృష్ణ ప్రియాయై సతత౦ మహాలక్ష్మ్యై నమోనమః!

2::పద్మ పత్రేక్షణాయై చ పద్మాస్యాయై నమోనమః
పద్మాసనాయై పద్మిన్యై వైష్ణవ్యై చ నమోనమః!

3::సర్వస౦పత్స్వరూపిణ్యై సర్వారాధ్యాయై నమోనమః
హరిభక్తి ప్రదాత్ర్యై చ హర్షదాత్ర్యై చ నమోనమః!

4::కృష్ణ వక్షఃస్థితాయై చ కృష్ణేశాయై నమోనమః
చ౦ద్రశోభా స్వరూపాయై రత్నపద్మే చ శోభనే!

5::స౦పత్త్యధిష్ఠాతృ దేవ్యై మహాదేవ్యై నమోనమః
నమో బుద్ధిస్వరూపాయై బుద్ధిదాయ్యై నమోనమః!

6::యథామాతా స్తనా౦ధానా౦ శిశూనా౦ శైశవే సదా
తథా త్వ౦ సర్వదా మాతా సర్వేషా౦ సర్వరూపతః!

అగస్త్య కృత లక్ష్మీ స్తోత్రం





















అగస్త్య కృత లక్ష్మీ స్తోత్రం

1::మాతర్నమామి కమలే కమలాయతాక్షి
శ్రీ విష్ణు హృత్కమల వాసిని విశ్వమాతః
క్షీరోదజే కమల కోమల గర్భగౌరీ 
లక్ష్మీ ప్రసీద సతతం నమతా శరణ్యే!

2::త్వం శ్రీ రుపేంద్ర సదనే మదనైకమాతః
జ్యోత్స్నాసి చంద్రమసి చంద్ర మనోహరాస్యే
సూర్యే ప్రభాసి చ జగత్త్రితయే ప్రభాసి
 లక్ష్మీ ప్రసీద సతతం నమతా శరణ్యే!

3::త్వం జాతవేదసి సదా దహనాత్మ శక్తిః
వేధా స్త్వయా జగదిదం వివిధం విదధ్యాత్
విశ్వంభరోపి భిభ్రుభయాదఖిలం భవత్యా
లక్ష్మీ ప్రసీద సతతం నమతా శరణ్యే!

4::త్వత్త్యక్తమేతదమలే హరతే హరోపి
త్వంపాసి హంసి విదధాసి పరావరాసి
ఈడ్యో బభూవ హరిరప్యమలే త్వదాప్త్యా
లక్ష్మీ ప్రసీద సతతం నమతా శరణ్యే!!

5::శూరః శ ఏవ శ గుణీ శ బుధః శ ధన్యో
మాన్యః శ ఏవ కులశీల కళాకలాపైః
ఏకః శుచిః స హి పుమాన్ సకలేపి లోకే
యత్రాపతేత్తవ శుభే కరుణా కటాక్షః!

6::యస్మిన్ వసేః క్షణమహో పురుషే గజేశ్వే
స్త్రైణే తృణే సరసి దేవకులే గృహేన్నే
రత్నే పతత్త్రిణి పశౌ శయనే ధరాయాం
శ శ్రీకమేవ సకలే తదిహాస్తి నాన్యత్!

7::త్వ త్స్ప్రుష్టమేవ శకలం శుచితాం లభేత
త్వత్త్యక్త మేవ శకలం త్వశుచీహ లక్ష్మి
త్వ న్నామ యత్ర చ సుమంగళమేవ తత్ర
శ్రీ విష్ణు పత్ని కమలే కమలాలయేపి!

8::లక్ష్మీ శ్రియంచ కమలం కమలాలయాంచ
పద్మాం రమాం నళినయుగ్మకరాం చ మాం చ
క్షీరోదజామమృత కుంభ కరామిరాంచ
విష్ణుప్రియా మితి సదా జపతాం క్వ దుఃఖం!

ఈ స్తోత్రమును భక్తితో పఠించు వారికి సంతాపము, దారిద్ర్యము, ప్రియ వియోగము, 
సంపత్తి క్షయము ఉండవు. సర్వత్ర విజయము కల్గును. వంశ విచ్చేదము ఉండదు.

Tuesday, October 4, 2011

శ్రీ దేవి నవరాత్రి..తేది వారము నక్షత్రము తిధి అలంకారములు




********************************************************************************************************************************************************************
********************************************************************************************

శ్రీ దేవి నవరాత్రి..తేది..వారము..నక్షత్రము..తిధి..అలంకారములు..
చీర రంగు..మరియు..ఒకొక్క అమ్మవారికి..ఒక్కొక్క నైవేద్యం
-----------------------------------------------------------------------------
28-09- 2011..భుదవారము..ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి..శ్రీ బాలత్రిపుర సుందరి దేవి..( నీలం రంగు )
నైవేద్యం..(ఉప్పు పొంగల్ )
-----------------------------------------------------------------------------
29-09-2011..గురువారం..ఆశ్వయుజ శుద్ధ విదియ..శ్రీ గాయత్రి దేవి..( పసుపు రంగు )
నైవేద్యం..( పులిహోర )
------------------------------------------------------------------------------
30-09-2011..శ్రుక్రవారము..ఆశ్వయుజ శుద్ధ తదియ..శ్రీ మహా లక్ష్మి దేవి..( తెలుపు రంగు )
నైవేద్యం..( రవకేసరి )
-------------------------------------------------------------------------------
01-10- 2011..శనివారము..ఆశ్వయుజ శుద్ధ చవితి..శ్రీ అన్నపూర్ణ దేవి..(లేత ఎరుపు)
నైవేద్యం..(కొబ్బెర అన్నం )
-------------------------------------------------------------------------------
02-10-2011..ఆదివారము..ఆశ్వయుజ శుద్ధ పంచమి..శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి.(ఆకాషం రంగు)
నైవేద్యం..( అల్లం గారెలు )
-------------------------------------------------------------------------------
03-10-2011..సోమవారము..ఆశ్వయుజ శుద్ధ సప్తమి..(మూలా నక్షత్రము) శ్రీ సరస్వతి దేవి.(కనకాంబరం రంగు ) నైవేద్యం..( పెరుగన్నం )
-------------------------------------------------------------------------------
04-10- 2011..మంగళవారము..ఆశ్వయుజ శుద్ధ అష్టమి..శ్రీ దుర్గా దేవి..( మెరుణ్ కలర్ )
కదంబం..అంటే ..(వెజిటబుల్..రైస్ కలిపి వండే ఐటం )
-------------------------------------------------------------------------------
05-10- 2011..భుదవారము..ఆశ్వయుజ శుద్ధ నవమి..శ్రీ మహిషాసుర మర్ధిని దేవి..( ఎఱ్ఱటి ఎరుపు రంగు)
నైవేద్యం...( బెల్లమన్నం )
-------------------------------------------------------------------------------
06-10-2011..గురువారం..ఆశ్వయుజ శుద్ధ దశమి..(విజయదశమి) శ్రీ రాజరాజేశ్వరీ దేవి..( ఆకుపచ్చ రంగు )
నైవేద్యం..( పరమాన్నం )
-------------------------------------------------------------------------------