Sunday, May 15, 2011

శ్రీషిర్దీ సాయిబాబాను ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి



శ్రీషిర్దీ సాయిబాబాను ప్రత్యక్షంగా చూసినవాళ్ళలో జీవించి ఉన్న ఏకైక వ్యక్తి గీతాబాయి గధియా



మహారాష్ట్ర అహ్మద్ నగర్ జిల్లా రహతా లో నివసిస్తున్న గీతాబాయి గధియా గారి  వయస్సు ఇప్పుడు 105 సంవత్సరాలు. శ్రీషిర్దీ  సాయిబాబాను స్వయంగా చూసినవాళ్ళలో ఆవిడ ఒక్కరే యిప్పటికీ జీవించి ఉన్నారు.  ఆవిడ  తాను ప్రత్యక్షంగా  షిర్డీ  సాయిబాబాను చూశారు.   ఆవిడ ఆయన పాదాలను స్పృశించారు.  బాబాగారు తమ దివ్య హస్తాలతో యిచ్చిన వాటిని ఆవిడ స్వీకరించారు.  మనం సాయిబాబా  విగ్రహాన్ని చూస్తాము.  గీతాబాయి గారు సాయిబాబాను ప్రత్యక్షంగా చూశారు.  మనము సాయిబాబా పాదాలవద్ద మన కానుకలను సమర్పిస్తాము.  గీతాబాయి గారు నేరుగా సాయిబాబాగారి దివ్యహస్తాలకు అందించారు.  మనం సాయిబాబా గురించి విన్నాము.  గీతాబాయి గారు సాయిబాబా స్వయంగా మాట్లాడటం విన్నారు.  మనకు ఈ మధ్యనే సాయిబాబా గురించి తెలిసింది.  గీతాబాయిగారికి 95 సంవత్సరాల క్రితం నుండే  సాయిబాబా గురించి తెలుసు.  మనకు బాబా సమాధి దర్శన భాగ్యం కలిగింది.  గీతాబాయిగారు సాయిబాబాగారి దివ్య చరణకమలాలను స్వయంగా స్పృశించారు.  మనం సాయి భజనలు చాలా రచించాము.  గీతాబాయిగారు సాయిబాబా పాడటం స్వయంగా విన్నారు.  మనం షిరిడీకి నడచి వెడతాము.  గీతాబాయిగారిని ఆవిడ తండ్రి షిరిడీకి ఎత్తుకొని తీసుకొని వెళ్ళారు.  మనం బాబాకు నైవేద్యం సమర్పిస్తాము.  గీతాబాయి గారి చిన్ని చేతులు బాబాగారిచ్చిన కానుకలతో నిండిపోయాయి.  మనం బాబాను పిలుస్తాము.  కాని, గీతాబాయిగారిని సాయిబాబా తానే స్వయంగా పిలిచారు.  సాయిబాబాగారిని చూసినప్పుడు ఆవిడ వయసు కేవలం 10 సంవత్సరాలు. ఆరోజుల్లో సాయిబాబాతో తన చిన్నతనంలో గడిపిన రోజులు, ప్రతి సంఘటన ఆవిడకి బాగా గుర్తున్నాయి.  ప్రతివిషయం బాగా గుర్తుకు తెచ్చుకోగలరు.  10 సంవత్సరాల క్రితం ఆవిడకు 3 సార్లు హార్ట్ ఎటాక్ వచ్చింది.  గీతాబాయిగారు యిప్పుడు ఏడవతరానికి సంబంధించిన వారసులతో ఉన్నారు.  ఆవిడ డాక్టర్ల మీద గాని, మందుల మీద గాని ఆధారపడకుండా యితకుముందు లాగే మంచి ఆరోగ్యంతో ఉన్నారు.  ఇప్పటికీ ఆవిడ మంచి శరీర సౌష్టవంతో ఆరోగ్యంగా ఉండటం చూసిన పెద్ద పెద్ద డాక్టర్లు కూడా ఆమెను ఎంతో గౌరవిస్తారు.  ఆవిడ దృష్టి యిప్పటికీ చక్కగా ఉంది.  మంచి వినికిడి శక్తి వుంది.  ఆవిడ చక్కగా మాట్లాడగలరు.  తాను స్వయంగా వ్రాసిన సాయి భజనలను పాడగలరు.  ఆమె ప్రతీరోజు ఉదయం 3 గంటలకే లేచి, ఎవరి సహాయం లేకుండా తన పనులను తానే స్వయంగా చేసుకొంటారు.  తేలికపాటి ఆహారం, డ్రై ఫ్రూట్స్, స్వచ్చమైన వెన్న తీసుకుంటారు. ఆమె బాబాగారు వంట చేసే కుండని, గోధుమలను విసిరే తిరగలిని, ఎప్పుడు జ్వలిస్తూ ఉండే ధునిని చూశారు.  బాబా తన దుస్తులను తానే స్వయంగా ఉతుకుకొని వాటిని వాడాలో ఆరవేయడం చూశారు.  ఆవిడ మేనత్త (తండ్రి సోదరి) ద్వారకామాయి కుడిప్రక్కనే షిరిడీలో ఉండేవారు.  గీతాబాయిగారు 10 సంవత్సరాల వయసులో ఆమె మేనత్త యింటికి వెళ్ళి అక్కడ గడుపుతూ ఉండేవారు. ఆరోజుల్లో ఆడపిల్లలను యింటిలోనుండి బయటకు వెళ్లనిచ్చేవారు కాదు.  ఆవిధంగానే గీతాబాయిగారి విషయంలో కూడా.  కాని, ఎప్పుడయినా బయటకు వెళ్ళినపుడు అవిడ ద్వారకామాయికి వెళ్ళి సాయిబాబాతో ఆడుకునేది.  బాబాగారు ఫొటోలో ఉన్నట్లుగానే ఎలా దుస్తులు ధరించేవారో ఆవిడ వర్ణించి చెపుతూ ఉంటారు. ఇంక్కా ఆవిడ వర్ణించి చెప్పిన సంఘటనలు.   బాబా ఆవిడను చూడగానే నీకేమయినా డబ్బు కావాలా అని అడిగేవారు.  బాబా రహతా వెళ్ళేటపుడు కదలుతున్న బస్సులోకి కూడా ఎక్కేవారు.  అలాగే బస్సు వెడుతున్నపుడు కూడా బస్సులోనించి దిగేవారు.  రహతా వెళ్ళినపుడెల్లా అక్కడి దుకాణుదారులు తమంత తామే బాబాకు కానుకలు సమర్పించుకొనేవారు.  బాబా షిరిడీకి తిరిగి వచ్చిన తరువాత వాటినన్నిటినీ పంచిపెట్టేస్తూ ఉండేవారు. అలా పంచిపెట్టబడినవాటిలో బాబానుంచి ఆవిడకు డ్రైఫ్రూట్స్ లభించాయి. బాబాగారినించి స్వయంగా డ్రైఫ్రూట్స్ స్వీకరించిన గీతాబాయి గారు ఎంతో అదృష్టవంతురాలు. ఆరోజుల్లో పిల్లల మీద ఎన్నో ఆంక్షలు ఉండేవి.  పిల్లలను ఎక్కడా బయట తిరగనిచ్చేవారు కాదు.  ఎవరితోనూ కలవనిచ్చేవారు కాదు.  బాబాగారు చేసిన అద్భుతాలేమీ కూడా ఆమెకు చూసే అదృష్టం కలగలేదు.  బాబావారిని దర్శించడానికి ఎంత పెద్ద గుంపు ఉండేదో కూడా ఆమెకు తెలీదు.  కాని, బాబా ఊదీ ఎంత అమోఘమైందో ఆమె ధృవపరుస్తూ చెప్పారు.  దానికి తానే సాక్ష్యమని చెప్పారు.  బాబా చేసే అద్భుతాలకు తాను ఆయనని "అధ్బుతాలను చేసే బాబా" అని అనేదానినని చెప్పారు. చిన్నతనం వల్ల అప్పట్లో ,  బాబా మహాసమాధి చెందేవరకు వాస్తవానికి సాయిబాబాగారి ఔన్నత్యం గురించి తెలియదని చెప్పారు .  ఆతరువాతే అందరూ ఆయన భగవంతుడని తెలుసుకొన్నారు.    

No comments: