ఓం హ్రీం హ్ర్సైం హ్రీం ఓం ఐం థీం క్లీం సౌః సరస్వత్య్తే స్వాహాః ||
శ్రీ మహా సరస్వతి యంత్రమును అర్చించు వారు యంత్రమును రాగి రేకు పై కాని కాగితముపై కాని వ్రాసి పటము కట్టించి యథా శక్తి గా ఉదయాస్తమయములందు షోడశోపచార పూజలు చేయుచున్న గొప్ప గద్య పద్య రచన వాక్సుద్ధి , విద్య ప్రాప్తి , మేథా ధారణా శక్తి తప్పక కలుగును.
శ్రద్ధా వంతులు ప్రతి నిత్యము ఆచమ్య , ప్రాణామాయ , గోత్ర దేశ కాల మాన సంకీర్తణాధికముగా త్రి న్యాస పూర్వకముగా , పంచ పూజలొనర్చిన విశేష ఫలము కలుగును.మూల మంత్ర జపముతో పాటు క్రింది తత్ గాయిత్రి ని కూడ జపదశాంశము గావించిన మహోత్కృష్ట ఫలితములు తప్పక కలుగును.
ధ్యానము , మూల మంత్రము , ఏ తత్ గాయిత్రి ఈ మూడింటిని అనునిత్యము అనుసరించు సాధకుడు పొందలేని ఫలితమే లేదు. అనగా తలచినంతనే సాధకుని కృషి యత్నములనుసరించి మంత్ర యంత్రములు పని సాధన లందు అనంత ఫల సాధకము లగును.
-: శ్రీ సరస్వతీ గాయత్రి :-
|| వాగ్దేవ్యైచ విద్మహే బ్రహ్మపత్న్యైచ ధీమహితన్నోవాణీః ప్రచోదయాత్.//
3 comments:
నమస్తే నా పేరు ప్రియాంక నేను చదువుకుంటున్న విద్యార్దిని.నేను ప్రతి నిత్యము ఈ మూల మంత్రం జపించాలనుకుంటున్నాను.నేను అలా చేయవచ్చా ? ఎ విధంగా చేయాలి ? ఎన్ని సార్లు జపించాలి ? దయచేసి వివరించగలరు .
నమస్తే ప్రియాంక గారు మరోలా భావించకండి.. మూల మంత్రం ఏదైనా సరే చేయరాదు క్షమించండి బాధ పెట్టాలని కాదు...
ఆడవాళ్లు మూల మంత్రం జపించకూడదు,కృష్ణ మంత్రం జపించండి.ప్రియాంక గారు
Post a Comment