1}
|| ॐ || RAMA SETHU'S CONSTRUCTION || ॐ ||
ॐ "NALA " of Ramayana is the Son of SRI VISHWAKARMA. He is the world's first "Hydraulic Engineer."During Tretayuga, they helped LORD RAMA to create a Way to Lanka.
ॐ They decided to construct a long SETHU(Bridge) on the Indian Ocean for Lord Sri Rama and his Warriors(VANARAS) to reach Lanka and to defeat RAVANA in the Battle.
ॐ They made a Bridge comprising the Length of 48 Kilometers, Width 2.5 to 3 Km and a depth of 22Feets (Inside the sea) by using the Cranes, Drilling Machines and other materials, with the help of experts(in Vanara sena). Use of machines is described in Valmiki Ramayana 6-22-59.
ॐ Let us see how that was designed and constructed by Our Ancient Engineers.
ॐ NASA released some photographs of Ram Setu in 2002. According to research, these images show a chained arrangement of rocks which was sub-merged in water on the stretch between Rameswaram in Tamil Nadu of India(Bharat) and Talaimannar on Sri Lanka.
ॐ A study of the Shuttel RADAR topographic machine data reveals that Ram setu is 48 Kms long with 7 openings allocated at equal intervals to drain out water.
ॐ The Bridge is slightly Curve/Arc shape, so it can withstand high currents of water.
ॐ It has been construced in shallow waters which cannot be a natural formation.
ॐ Another fact which proves it to be a man-made structure is its width, which is 2.5 kms to 3 kms and it increases gradually ad it advances towars Sri Lanka. This design is in accordance with the rules of Modern Architecture.
ॐ Trethayuga's age cycle is 12,96,000 years, then later Dwaparayuga of 8,64,000 years) and the Kaliyuga( 4,32,000 Years). 5113 years have elasped in kaliyug till now. Lord Sri Ram incarnated at the end of Tretayuga. And ruled for 11,000 years. If we calculate the time period, 11,000 years+ 864,000 years+ 432,000 years+ some more years ruled by Kusha(Son of Lord Rama), the count reaches nearly 9,00,000 years. And it reveals that We Hindus know such high Engineering Techniques at that time.
ॐ Mr.Rajeev Deekshit gave a presentation of photographs which prove that stones in Ram setu were attached by the Bolts which are made up of Non-Corrosive metal and also by lime stone and clay in some portions.
ॐ This shows that RAMA SETHU is not a Natural Formation. It was man-made structure and is the proof of Scientific Heritage of Ancient India (Bharat). And it is proof that Sri Ramayana is not a myth but a historical event and it is our Ancient History.
ॐ Say it with pride: We are Hindus.
ॐ Save RamSetu- Save India’s pride.
ॐ Jai Hind
|| ॐ || JAI SRI RAM - JAI JAI SRI RAM || ॐ ||
Eco vinayaka
|| ॐ || JAI SRI RAM - JAI JAI SRI RAM || ॐ ||
rachana::Eco vinayaka
"श्री*♥ ॐ♥"~"श्री*~*♥ ॐ♥~"श्री*~♥ ॐ♥"~"श्री*~♥ ॐ♥"*"श्री*♥*♥"श्री*♥ ॐ♥"~"श्री*~*♥ ॐ♥~"श्री*~♥ ॐ♥"~"श्री*~♥ ॐ♥"*"श्री*♥*♥"श्री*♥ ॐ♥"~"श्री*~*♥ ॐ♥~"श्री*~♥ ॐ♥"~"श्री*~♥ ॐ♥"*"श्री*♥*♥~*♥ ॐ♥~"श्री*~♥ ॐ♥"~"श्री*~♥~♥
2}
|| ॐ || జై శ్రీ రామ || ॐ ||
|| ॐ || రామసేతువు-2 || ॐ ||
ॐ త్రేతాయుగంలో శ్రీ మహావిష్ణువు శ్రీ రాముడిగా అవతరించారు కానీ ఎక్కడ మహిమలు చూపలేదు. ఒక మనిషి ఎలా ఆవేశపడతాడో, ఎలా భాధపడతాడో, కోపానికి, సంతోషానికి గురవుతాడో అచ్చం అలాగే రాముడు కూడా అనుభవించాడు. మనిషి ఎలా బ్రతకాలో, తాను తన దైవలీలలు చూపకుండా, మనిషిగా ధర్మాన్నీ ఆచరించి చుపించాడు. శ్రీ రామసేతువు నిర్మాణానికి సంబంధించి నలుడు, నీలుడికి రాముడికి మధ్య ఒక అద్భుతమైన సంవాదం రఘువంశంలో కనిపిస్తుంది.
ॐ రావణాసురుడు చేత అపహరించబడిన సీతమ్మ లంకలో ఉందన్న విషయం హనుమంతుని ద్వారా తెలుసుకున్న శ్రీ రాముడు సముద్రం దాటి లంకకు ఎలా చేరాలా అని చింతిస్తున్నాడు. అప్పుడు వానరసేనలో ఉన్న నలుడు, నీలుడు రాముడి వద్దకు వచ్చారు. వీళ్ళిద్దరు ఈ ప్రపంచ చరిత్రలో తొలి Hydraulic Engineerలు.
ॐ వాళ్ళు రాముడిని సమీపించి "మీరేం భాధపడకండి. రాళ్ళ సహాయంతో సముద్రంలో మేము వంతెన నిర్మిస్తాము".
ॐ సముద్రంలో రాళ్ళు ఎలా నిలబడతాయి? అని రాముడు ప్రశ్నిస్తే, మీకు ఆందోళన ఎందుకు? అది మాకు సంబంధించిన విషయం. Hydraulics మాకు అర్దమవుతాయి కానీ మీకు కాదు. ఎందుకంటే మాకు Hydraulic Engineeringలో మంచి నైపుణ్యం ఉంది.
ॐ పడవల సహాయంతో సముద్రంలో రాళ్ళను పడేసి, ఒకదానిపై ఒకటి పేరుస్తాము. అవి పైవరకు వచ్చాక అప్పుడు సేతువు నిర్మాణం మొదలుపెడతామన్నారు నలుడు, నీలుడు. ఈ వంతెన నిర్మాణానికి ఎన్ని రోజుల పడుతుంది అని రాముడు అడుగగా, ఎన్ని రోజులైనా పట్టనివ్వండి, వంతెన పూర్తి చేస్తాం అన్నారు.
ॐ వారధి పూర్తిచేస్తారు, మనం లంకకు వెళ్తాం, వెళ్ళిన వాళ్ళం తిరిగివస్తామా? వంతెన మధ్యలోనే కూలిపోతే? అని రాముడు తన సందేహాలను వ్యక్తం చేశాడు. మీకు నేను ఒక విషయం స్పష్టంగా చెప్తున్నా, ఈ వంతెన మీద వెళ్ళిన మన సేన ఖచ్చితంగా తిరిగివస్తుంది. కాని రావణాసురిడి సైన్యం వస్తే మాత్రం ఈ వంతెన కూలిపోతుంది. ఇదెలా జరుగుతుందంటే, మేము ముందే ప్లాన్ వేసి, కొలతలు తీసుకున్నాం. మన సేనలో అన్ని వానరాలే(కోతులు) ఉన్నాయి. కోతులు నడిచే సమయంలో భూమి మీద అతితక్కువ ఒత్తిడి(pressure) మాత్రమే పెడతాయి.
ॐ పరమాత్ముడు వాటి శరీరాన్ని ఏ విధంగా రూపొందించాడంటే, అవి తమ చేతులు, కాళ్ళను అతి తక్కువ సమయం నేలపై పెడతాయి, ఒక వేళ వాటి చేతులు, కాళ్ళను భూమి పై పెట్టిన వెంటనే అక్కడి నుండి దూకి వేరే ప్రదేశానికి వెళతాయి. అలా చాలాదూరం అవి దూకుతూ(jump) వెళ్ళగలవు. 1, 2 కిలోమీటర్లకంటే ఎక్కువ దూరం అవి అలాగే వెళ్ళగలవు.
ॐ ఈ వంతెన డిజైన్ ఏ విధంగా చేసామంటే, దాని మీద వానరాలుదూకుతూ దాటగలవు, కానీ రావణ సైన్యం వచ్చిదంటే ఈ వంతెన కుప్పకూలిపోతుంది. ఎందుకంటే రావణసైన్యంలో అందరూ రాక్షసులే ఉన్నారు. వారి శరీరం చాలా పెద్దగా, బలంగా ఉంటుంది. వారూ నేలమీద తమ శరీరం ద్వారా అధిక భారం/ ఒత్తిడి(pressure) వేస్తారు. అందువల్ల ఈ సేతువు తెగిపోతుంది. వాళ్ళు మునిగిపోతారు. మనమే గెలుస్తాము. ఓడిపోయే అవకాశమే లేదు అన్నారు నలుడు, నీలుడు.
ॐ సేకరణ-
Ram Setu A Construction Engineering Wonder
రాజీవ్ దీక్షిత్ ఉపన్యాసం(హిందీ)
ॐ రామసేతువు నిర్మాణం ఎలా చేశారు?
To be continued...............
|| ॐ || జై శ్రీ రామ || ॐ ||
rachana::Eco vinayaka
"श्री*♥ ॐ♥"~"श्री*~*♥ ॐ♥~"श्री*~♥ ॐ♥"~"श्री*~♥ ॐ♥"*"श्री*♥*♥"श्री*♥ ॐ♥"~"श्री*~*♥ ॐ♥~"श्री*~♥ ॐ♥"~"श्री*~♥ ॐ♥"*"श्री*♥*♥"श्री*♥ ॐ♥"~"श्री*~*♥ ॐ♥~"श्री*~♥ ॐ♥"~"श्री*~♥ ॐ♥"*"श्री*♥*♥~*♥ ॐ♥~"श्री*~♥ ॐ♥"~"श्री*~♥~♥
3}
జై శ్రీ రామ
శ్రీ రామసేతువు-3
రామసేతువును ఎలా నిర్మిచారు?
వాల్మీకి రామాయణం : (6-22-51 TO 6-22-71) సమర్ధచాపి సేతుం కర్తుంవై వరుణాలయే ||6-22-51
తస్మాతథైవ బంధంతు సేతుం వానర పుంగవః
నేను సేతువును నిర్మించడంలో సమర్ధుడను. వానరులలో బలవంతులు ముందుకు వస్తే ఇప్పుడె నిర్మిస్తాను అన్నాడు నలుడు. రాముడూ ఆజ్ఞతో కొన్ని వందల వానరాలు అన్ని వైపులా వ్యాపించి ఉన్న అడవులపైకి ఆనందంతో గంతులు వేస్తూ పరిగెత్తాయి. పర్వతాల వంటి శరీరం సౌష్టవం కలిగిన వానరసేనాధిపతులు పెద్ద పెద్ద రాళ్ళను, కొండలను, చెట్లను విరగ్గొట్టి సుంద్రం వద్దకు తీసుకువచ్చారు. అశ్వకర్ణ, ధావ, అర్జున, మామిడి, అశోక, బిల్వ, శతపర్ణ మొదలైన చెట్లను సందురంలో పడేస్తున్నారు. మంచివానరాలు కొన్ని చెట్లను వ్రేళ్ళతో సహా , కొన్నిటికి వ్రేళ్ళు లేకుండానూ భూమిని నుంచి పెల్లగించి, ద్వజస్థంభాలను ఎత్తుకొస్తున్నారా అన్నట్టుగా తీసుకువచ్చారు. ప్రక్కన ఉన్న ప్రదేశాల నుండి వేప, కొబ్బరి, దానిమ్మ మొదలైన చెట్లను కొన్ని వానరాలు తీసుకువస్తున్నాయి.
హస్తిమాత్రన్ మహాకాయః పాశానాంచ మహాబలః ||6-22-58
పర్వతాంశ్చ సముత్పట్యా యంత్రైః పరివహంతి చ
ప్రక్షిప్యామాణైర్ అచలైః సహసా జలం ఉద్దతం ||6-22-59
కొండలవంటి శరీరంతో, ఏనుగులవలే ఉన్న కొండలను పెల్లగించి యంత్రాల(Machines/cranes) సహాయంతో తరలించి, ఒక్కసారిగా అన్ని వైపుల నుండి సముద్రంలో రాళ్ళను పడేయడంతో సముద్రంలో నీరు ఒక్కసారిగా పైకి లేచి క్రింద పడుతోందట.(యంత్రాలంటే క్రేన్లు మొదలైనవి. ఇవి ఆ కాలానికే ఉన్నాయి).
"సూత్రాణ్యయే ప్రగృణంతి హ్యాయతం శతయోజనం" అంటే ఈ సమయంలో కొందరు రామసేతువును సరైన ఆకారంలో ఉందా, కొలత సరిగ్గా ఉందా అని కొలవడానికి వందయోజనాల stringను సిద్ధం చేస్తున్నారట. నలుడు, తన బాధ్యతగా సముద్రం మధ్యలో సేతువును నిర్మాణాన్ని ఇతర వానరాల సహాయంతో ప్రారంభించాడు. కొందరు వంతెన కొలవడానికి పొడవైన కర్రలనూ, ఇంకొందరు నిర్మాణానికి సంబంధించిన ఇతరవస్తువులను(సున్నం మొదలైనవి) దగ్గరపెట్టుకున్నారు. రెల్లుగడ్డి, పెద్ద పెద్ద దుంగలను కొన్ని వందల వానరాలు తీసుకువచ్చి, రాముడి ఆజ్ఞతో సేతువు నిర్మాణాన్ని వేగవంతం చేశాయి. మంచి సువాసన కలిగిన చెట్లను ఉపయోగించి, కొన్ని రకాల చేట్ల వ్రేళ్ళు, సున్నమూ, ఊడలతో బండలను ఒకదానికి ఒకటి దగ్గరగా,గట్టిగా కడుతూ అటూ, ఇటు వేగంగా పరుగులుపెడుతున్నాయి.
ఈ విధంగా మొదటి రోజు 14 యోజనాలు, రెండవ రోజు 20 యోజనాలు, 3వ రోజు 21 యోజనాలు, 4వ రోజు 22 యోజనాలు, 5వ రోజు 23 యోజనాలతో మహాసేతువును, ప్రపంచంలో మానవనిర్మిత వంతెనను నలుడు ఆధ్వర్యంలో వానరసేన పూర్తిచేసింది.
ఆధునిక ఇంజనీరింగ్ నిపుణులే ఆశ్చర్యపడేంతగా రామసేతువు నిర్మాణంలో ఉన్న నైపుణ్యం, ప్రత్యేకత ఏమిటి? అది ఇన్ని సంవత్సరాలు ఎందుకు నిలిచి ఉంది?
To be continued............
జై శ్రీ రామ
rachana::Eco vinayaka
"श्री*♥ ॐ♥"~"श्री*~*♥ ॐ♥~"श्री*~♥ ॐ♥"~"श्री*~♥ ॐ♥"*"श्री*♥*♥"श्री*♥ ॐ♥"~"श्री*~*♥ ॐ♥~"श्री*~♥ ॐ♥"~"श्री*~♥ ॐ♥"*"श्री*♥*♥"श्री*♥ ॐ♥"~"श्री*~*♥ ॐ♥~"श्री*~♥ ॐ♥"~"श्री*~♥ ॐ♥"*"श्री*♥*♥~*♥ ॐ♥~"श्री*~♥ ॐ♥"~"श्री*~♥~♥
4}
జై శ్రీ రామ
శ్రీ రామసేతువు - 4
నలుడి ఆధ్వర్యంలో క్రేనులు, డ్రిల్లింగ్ మెషీన్లు, నైపుణ్యం కలిగిన వానరుల సహాయంతో 48 కిలోమీటర్ల పోదవు, 2.5-3 కిలోమీటర్ల వెడల్పుతో, సముద్రగర్భంలో 22 అడుగుల లోతు వరకు ఉండేలా సేతువును నిర్మించారు. అసలే సముద్రం మీద నిర్మిస్తున్న వంతెన. Straight గా నిర్మిస్తే పెద్దపెద్ద సముద్రపు అలల తాకిడి వలన ఒత్తిడికి గురై నిర్మాణానికి ప్రమాదం సంభవిస్తుందని, వంతెన మధ్యలోనే తెగిపోయే ప్రమాదం ఉందని, Arc Shape వచ్చేలా వారధిని డిజైన్ చేశారు. సునామీ(ఉప్పెన) వంటి ఉత్పాతాలు సంభవించినా సేతువుకు ఎటువంటి నష్టం వాటిల్లకపోవడానికి కారణం సెతువు ' Arc'shape ఉండడమే.
సముద్రం మీద కడుతున్న వారధి, సముద్రం యొక్క ప్రవహానికి అడ్డురాకూడదని, అక్కడున్న జలచరాలకు ఇబ్బంది కలగకూడదని, అలాగే సముద్ర ప్రవాహానికి అడ్డుగా ఒక గోడలాగా కడితే, వంతెన life ఎక్కువకాలం ఉండదని, ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా నిర్మాణం చేయరాదని భావించినా నలుడు, సముద్రపు నీరు వెళ్ళేందుకు వీలుగా 7 equal intervalsలో రామసేతువు క్రింది భాగంలో openings వచ్చేలా డిజైన్ చేశారు. ఇవి నీటిని బయటకు drain చేస్తాయి.
సేతువు వెడల్పు(width) మొదట 2.5 కిలోమీటర్లు ఉండగా, మెల్లమెల్లగా పెరుగుతూ శ్రీ లంక చేరేసరికి 3 కిలోమీటర్లు అవుతుంది. ఇది ఈరోజు ప్రపంచంలో ఆధునిక నిర్మాణరంగంలో(Modern Architecture) అమలుచేస్తున్న డిజైన్.
త్రేతాయుగం అంటే 12,96,000 సంవత్సరాల కాలం.ఈ యుగంలోనే శ్రీ రామచంద్రుడు ఈ భూమిపై అవతరించాడు. తరువాత ద్వాపరయుగం 8,64,000 సంవత్సరాలు. ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం. ఇప్పటికి కలియుగంలో 5113 సంవత్సరములు గడిచాయి. రామసేతువు నిర్మాణం త్రేతాయుగం చివరలో జరిగినది. అంటే దాదాపు 9,00,000 ఏళ్ళ క్రితం.
ఈ రోజు మనం చెప్పుకుంటున్న అత్యాధునిక పరిజ్ఞానం మన హిందువులకు కొన్ని లక్షల సంవత్సరాలకు పూర్వమే ఉందని చెప్పడానికి ఇంతకన్నా ఋజువేం కావాలి చెప్పండి. హిందువైనందుకు గర్వించండి. Say it with pride : We are Hindus.
కొన్ని లక్షల సంవత్సరాలు నీటిలో ఉన్నా, చెడిపోని లోహం(Metal)తో చేసిన bolts వాడి బండలను జతపరిచారని, మధమధ్యలో సున్నం, బంకమట్టి మొదలైనవి వాడారని సేతువును పరీశీలించిన రాజీవ్ దీక్షిత్ మొదలైనవారు పేర్కొన్నారు. దానికి సంబంధించిన ఫోటోలను కూడా ప్రదర్శించారు.
పైన చెప్పిన వాటితో పాటు ఈ సేతువు సముద్రపు లోతు తక్కువగా(3-30 అడుగులు) ఉన్న ప్రదేశంలో ఉంది. అందువల్ల ఇది సహజంగా ఏర్పడినది కాదనడానికి అనేక ఆధారాలు దొరుకుతున్నాయి.
రామసేతువును కాపాడుకుందాం. రామాయణం మనదేశ చరిత్రలో భాగం అని ప్రపంచానికి సగర్వంగా చాటి చెప్పుకుందాం.
జై శ్రీ రామ
rachana::Eco vinayaka
"श्री*♥ ॐ♥"~"श्री*~*♥ ॐ♥~"श्री*~♥ ॐ♥"~"श्री*~♥ ॐ♥"*"श्री*♥*♥"श्री*♥ ॐ♥"~"श्री*~*♥ ॐ♥~"श्री*~♥ ॐ♥"~"श्री*~♥ ॐ♥"*"श्री*♥*♥"श्री*♥ ॐ♥"~"श्री*~*♥ ॐ♥~"श्री*~♥ ॐ♥"~"श्री*~♥ ॐ♥"*"श्री*♥*♥~*♥ ॐ♥~"श्री*~♥ ॐ♥"~"श्री*~♥~♥
5}
|| ॐ || జై శ్రీ రామ || ॐ ||
700 సంవత్సరాల ఇస్లాం దండయాత్రలు, 300 సంవత్సరాల (బ్రిటిష్)క్రైస్తవ ఆక్రమణ, దాడుల తరువాత కూడా ఈ ప్రపంచంలో అనాది కాలం నుండి కొనసాగుతూ వస్తున్నది ఒక్క హిందూ ధర్మమే. మన సంస్కృతి ఎవరు వేలెత్తి చూపలేరు. గత 200 సంవత్సరాలలో కొనుగొన్నామని చెప్తున్న సాంకేతిక పరిజ్ఞానమంతా కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే మన తాళ్ళపత్ర గ్రందాల్లో రాయబడి ఉన్నాయి. మనకు అనేక పురాణాలు, ఇతిహాసాలు, చరిత్రలు, స్మృతులు, సంహితలు ఉన్నాయి. రామాయణ, మహభారతాలు ఇతిహాసాలు. ఇతిహాసం అంటే 'ఇలాగే జరిగింది ' అని అర్దం. ఇవి ఈ సృష్టి వయసు కొన్ని కోట్ల సంవత్సరాలని ఈనాటి ఆధునిక శాస్త్రవేత్తలు చెప్పడానికి కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే చెప్పాయి.
భారతదేశాన్ని పరిపాలించిన బ్రిటిష్ వారు ఈ దేశాన్ని ఆక్రమించాలి అంటే ఈ దేశ సంస్కృతిని, ధర్మాన్ని, విలువలను నాశనం చేయాలని భావించారు. దానికి ఆద్యుడు మోకాలె. ఈయన భారతదేశం మొత్తం పర్యటించి బ్రిటిష్ పార్లమెంట్లో 2-2-1835 న ఒక ప్రసంగం చేశాడు.
Lord Macaulay’s address to the British Parliament in 2 February, 1835:
"I have traveled across the length and breadth of India and I have not seen one person who is a beggar, who is a thief. Such wealth I have seen in this country, such high moral values, people of such calibre, that I do not think we would ever conquer this country, unless we break the very backbone of this nation, which is her spiritual and cultural heritage, and, therefore, I propose that we replace her old and ancient education system, her culture, for if the Indians think that all that is foreign and English is good and greater than their own, they will lose their self-esteem, their native self-culture and they will become what we want them, a truly dominated nation."
ఈ దేశాన్ని ఆక్రమించాలన్నా, భారతదేశాన్ని ఎప్పటికి బానిస దేశం గా మార్చాలన్నా ముందు ఈ దేశస్థులకు తమ ధర్మం, తమ విద్యావిధానం కంటే, ఇంగ్లీష్ మరియు విదేశీ విద్యావిధానం మంచిది, వారి సంస్కృతే గొప్పదనే భావన రావాలి, అందుకు భారతదేశాంలో ఇంగ్లీష్ విద్యను ప్రవేశపెట్టాలని చెప్పడమే ఆ ప్రసంగ సారాంశం. దాని అమలు పరిచి Geometry వంటి 18 సబ్జెక్టులతో ఉన్న హిందూ విద్యావిధానాన్ని సర్వనాశనం చేశారు.
దానికి తోడు వారి బైబిలు ఈ సృష్టి వయసు 5000 సంవత్సరాలని చెప్పింది. దాని వాదనను బలపరచడం కోసం, తమ మతాన్ని ప్రచారం చేయడం కోసం మన దేశ చరిత్రను తారుమారు చేసి కల్పితమైన చరిత్రను మనకు ఇచ్చారు. దాదాపు 2000 సంవత్సరాల చరిత్రను తొక్కేశారు (ఆధారాలు రాబోయే రోజుల్లో తెలియపరుస్తాం). ఇప్పుడు మనం పాఠశాలలో చదివినది, వారు వ్రాసిన చరిత్రే. దానితో పాటు అనేక చారిత్రిక ఆధారాలను నాశనం చేశారు. అప్పుడే వారు హిందువుల పురాణాలు కల్పితాలు, అవన్ని అబద్దాలంటూ, పుక్కిటి పురాణాలు హిందువులవి అంటూ ప్రచారం చేశారు. ఎందుకంటే మన దేశ చరిత్ర అంతా మన పురాణాల్లో సుస్పష్టంగా లిఖించబడి ఉంది. అవి తప్పని ప్రచారం జరిగితే కానీ తమూ వ్రాసిన చరిత్రను భారతీయులు నమ్మరన్నది వారి ఆలోచన.
వారి విద్యావిధానంలో చదువుకున్న మనం కూడా మన పురాణ, ఇతిహాసాలు కల్పితాలంటూ, మన సంస్కృతి వ్యర్ధమంటూ, పదేపదే మనల్ని మన నిందించుకుంటూ మోకాలే వారస పుత్రులం అయ్యాం.
విషయంలోకి వస్తే రాముడే లేడంటూ ప్రచారం జరుగుతున్న సమయంలో 2002 లో నాసా తమ ఉపగ్రహం(satellite) ద్వారా తీసిన కొన్ని ఫోటోలను విడుదల చేసింది. భారత్-శ్రీలంకల మధ్య ఒక వారాధి/వంతెన ఉందన్న విషయాన్ని ప్రపంచానికి తెలియపరిచింది. శ్రీ రాముడు లంకను చేరి, రావణ సంహారం చేయడానికి, వానరసేన నిర్మించిన వంతెన అది. దాని పేరే రామ సేతువు. ఈనాటికి హిందూ మహసముద్రంలో ఉన్నది ఈ 'శ్రీ రామ సేతువు '. దీని కూల్చడానికి కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వార్తలు వచ్చిన నేపధ్యంలో శ్రీ రామసేతువు గురించి ఆసక్తికర అంశాలు తెలుసుకుందాం.
to be continued...............
rachana::Eco vinayaka
|| ॐ || జై శ్రీ రామ || ॐ ||
"श्री*♥ ॐ♥"~"श्री*~*♥ ॐ♥~"श्री*~♥ ॐ♥"~"श्री*~♥ ॐ♥"*"श्री*♥*♥"श्री*♥ ॐ♥"~"श्री*~*♥ ॐ♥~"श्री*~♥ ॐ♥"~"श्री*~♥ ॐ♥"*"श्री*♥*♥"श्री*♥ ॐ♥"~"श्री*~*♥ ॐ♥~"श्री*~♥ ॐ♥"~"श्री*~♥ ॐ♥"*"श्री*♥*♥~*♥ ॐ♥~"श्री*~♥ ॐ♥"~"श्री*~♥~♥
జై శ్రీ రామ
హిందువులందరూ ఏకం కావలసిన సమయం వచ్చింది. కేంద్రప్రభుత్వం త్రేతాయుగంలో శ్రీ రాముడు లంకను చేరుకోవడానికి నలుడు, నీలుడనే Hydraulic Engineers గొప్ప ప్రణాళికతో, వానరజాతి సహకారంతో నిర్మించబడిన 'రామసేతువు ' కూల్చడానికి నిర్ణయించుకుంది. ప్రపంచంలో ఆధునిక ఇంజనీరులను కూడా విస్మయానికి గురిచేసే విధంగా ఉంది రామసేతు నిర్మాణం.
జై శ్రీ రామ
- http://indiatoday.intoday.in/story/setusamudram-project-will-be-made-says-centre/1/251414.html
"श्री*♥ ॐ♥"~"श्री*~*♥ ॐ♥~"श्री*~♥ ॐ♥"~"श्री*~♥ ॐ♥"*"श्री*♥*♥"श्री*♥ ॐ♥"~"श्री*~*♥ ॐ♥~"श्री*~♥ ॐ♥"~"श्री*~♥ ॐ♥"*"श्री*♥*♥"श्री*♥ ॐ♥"~"श्री*~*♥ ॐ♥~"श्री*~♥ ॐ♥"~"श्री*~♥ ॐ♥"*"श्री*♥*♥~*♥ ॐ♥~"श्री*~♥ ॐ♥"~"श्री*~♥~♥
|| ॐ || RAMA SETHU'S CONSTRUCTION || ॐ ||
The Centre has decided to reject the R. K. Pachauri report and go ahead with the Setusamudram shipping channel project cutting through the sacred Ram Setu - a decision that could once again make it the target of multipronged attack from environmentalists, religious groups and political parties.
In an affidavit filed before the Supreme Cour t on Friday, the government submitted that it had decided to reject the conclusions and recommendations of the Pachauri committee which found the project to be "unviable both from the economic as well as ecological angles".
The government's decision is certain to bring it in confrontation with the Sangh parivar and the AIADMK, which is presently in the saddle in Tamil Nadu. Environmentalists, too, are up in arms against the project, arguing that it will destroy the ecology of the area.
The Pachauri committee was formed in 2008 to honour observations in this regard by then Chief Justice K. G. Balakrishnan in midst of a controversy over the government ignoring environmental concerns and religious sentiments.
- http://indiatoday.intoday.in/story/setusamudram-project-will-be-made-says-centre/1/251414.html
rachana::Eco vinayaka .... The real India
"श्री*♥ ॐ♥"~"श्री*~*♥ ॐ♥~"श्री*~♥ ॐ♥"~"श्री*~♥ ॐ♥"*"श्री*♥*♥"श्री*♥ ॐ♥"~"श्री*~*♥ ॐ♥~"श्री*~♥ ॐ♥"~"श्री*~♥ ॐ♥"*"श्री*♥*♥"श्री*♥ ॐ♥"~"श्री*~*♥ ॐ♥~"श्री*~♥ ॐ♥"~"श्री*~♥ ॐ♥"*"श्री*♥*♥~*♥ ॐ♥~"श्री*~♥ ॐ♥"~"श्री*~♥~♥
No comments:
Post a Comment