నిత్య మానవ ధర్మాలు ,
కార్తీక స్నాన విధి
కార్తీకేహం కరిష్యామి ప్రాతః స్నానం జనార్ధన!
ప్రీత్యర్ధం దేవ దేవేశ దావెూదర మయా సహా!!
అని శ్లోకాన్ని జపిస్తూ ప్రతి రోజూ ఉదయాన్నే చన్నీటి స్నాన మాచరించాలి.
ఆ తరువాత ఈ క్రింది మంత్రములు చదువుతూ సూర్యునికి అర్ఘ్యమును
ఈయవలెను.
మయా కృత కార్తీక స్నానాంగం అర్ఘ్య ప్రాదానం కరిష్యే
వ్రతినః కార్తికే మాసి స్నానస్య విదివన్మమ, ఘ్రుహానార్ఘ్యం మయా దత్తం
దనుజేంద్ర నిషూదన - శ్రీ కృష్ణాయ నమః ఇదం అర్ఘ్యం
నిత్య నైమిత్తికే కృష్ణు కార్తికే పాపనాశనే, ఘ్రుహానార్ఘ్యం మయా దత్తం
రాధాయా సహితో హరే - శ్రీ హరయే నమః ఇదం అర్ఘ్యం
అనేన అర్ఘ్య ప్రదానేన శ్రీ హరిః ప్రీయతాం"
నిత్య మానవ ధర్మాలు (17.12.2012)
5. తెల్లవారుజామున 4-5 గంటల మధ్య స్నానం చేయడం అత్యుత్తమం. దీన్ని రుషిస్నానం అంటారు. 5 నుంచి 6 గంటల మధ్య చేసే స్నానాన్ని దేవస్నానం అంటారు. ఇది మధ్యమం. ఇక 6 నుంచి 7 గంటల మధ్య చేసే స్నానాన్ని మానవస్నానం అంటారు. ఇది అధమం. ఇక 7 గంటల తర్వాత చేసే స్నానాన్ని రాక్షస స్నానం అంటారు. ఇది అధమాతి అధమం. కాబట్టి... ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి, రుషిస్నానం చేయడం పుణ్యప్రదం...
6. ఇక స్నానాల్లోకెల్లా... చన్నీటి స్నానం ఉత్తమమైనది.
ప్రవాహ ఉదకంలో స్నానం చేయడం ఉత్తమోత్తమం. చెరువులో స్నానం మధ్యమం. నూతివద్ద స్నానం చేయడం అధమం. మిగతా స్నానాలకు పేర్లులేవు. అయితే... హైదరాబాద్ నగర వాసులు అదృష్టవంతులు... నదివరకు వెళ్లి ప్రవాహ ఉదక స్నానం చేయకున్నా... రోజూ కృష్ణా, మంజీరా నదుల నీటితో స్నానం చేస్తుంటారు. అది ఉత్తమోత్తమం. ఇక హైదరాబాద్ లోని మరో భాగం ప్రజలు గండిపేట జలాశయం నీటితో స్నానం చేస్తుంటారు. ఇదీ మంచిదే. వేయిపనులున్నా... వాటిని వదిలి... సమయానికి స్నానం చేయాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి.
7. నదీస్నానం, కాలవల్లో స్నానం చేసేప్పుడు ప్రవాహానికి ఎదురుగా మగవారు, వాలుగా ఆడవారు స్నానం చేయాలి. మగవారు ఎదురుగా కాకుండా, వాలుగా స్నానం చేస్తే వారి మగతనం నషిస్తుంది. అదేవిధంగా ఆడవారు ప్రవాహానికి ఎదురుగా స్నానం చేస్తే... వారి స్త్ర్రీత్వం నశిస్తుంది. (ఇలాంటి చిన్నచిన్న పొరపాట్లే... నేడు సంతానలేమికి కారణమవుతున్నాయి)
8. ఒక నదిలో స్నానం చేసేప్పుడు మరో నదిని దూషించకూడదు.
నోట్: ఇవన్నీ పెద్దలు చెప్పిన మాటలు... మనుధర్మశాస్త్ర్రాల సారాలు. కాబట్టి.. ఎందుకు, ఏమిటి?? అని ప్రశ్నించకుండా... హిందూమతాభిమానం ఉన్నవారు పాటించగలరు. ప్రతిరోజూ కొన్ని ధర్మాలను మీ ముందు పెడతాను. దయచేసి అన్యమతస్తులు మీరు ఇష్యూ చేయడానికి నా వాల్ ను, నా పోస్టులను వేదికగా చేసుకోకండి. ఇక మనుధర్మశాస్త్ర్రాలను వ్యతిరేకించేవారున్నారు. అయితే... అందరికీ ఆమోదయోగ్యమైన ధర్మసూత్రాలను మాత్రమే ఇక్కడ నేను పోస్టు చేస్తున్నాను.
No comments:
Post a Comment