మన సంస్కృతిలో దీపారాధన అనేది ప్రధానాంశం. ఈ దీపారాధన పూజామందిరమందు, దేవాలయములో
గృహప్రాంగణములలో, తులసీ బృందావనమందు, మారేడు, రావి వంటి దేవతా వృక్షాల వద్ద, పుణ్య
నదీతీరములందు ప్రాతః కాలమందు, మరియు సంధ్యా సమయమందు వెలిగించుట అత్యంత పుణ్యప్రదమని
పురాణాలు వర్ణించి చెబుతున్నాయి.
కార్తీకే తిలతైలేన సాయంకాలే సమాగతే, ఆకాశదీపం యో దద్యాత్ మాసమేకం హరిం ప్రతి,మహతీం
శ్రియమాప్నోతి రూప సౌభాగ్య సంపదం(నిర్ణయ సింధు)
సంకల్పం: అహం సకల పాపక్షయపుర్వకం శ్రీ రాధా దామోదర ప్రీతయే అద్య ఆరంభ కార్తీక అమావాస్యా పర్యంతం
యథా శక్తి ఆకాశ దీపదానం కరిష్యే.
అని దీపం వెలిగించిన తరువాత ఈక్రింది శ్లోకం చదువుతూ నమస్కారం చేయాలి.
దామోదరాయ నభసి తులాయాం లోలయా సహా,
ప్రదీపం తే ప్రయచ్చామి నమో అనంతాయ వేధసే (నిర్ణయ సింధు)
ఇలా రోజూ చేయడం కుదరని పక్షంలో మాసాంతంలోని చివరి మూడు రోజులు చేసిననూ ఆయురారోగ్య ఐశ్వర్య
అభివృద్ది కలుగుతుంది
No comments:
Post a Comment