దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని
నాగుల చవితి పండుగ అంటారు.
కొందరు శ్రావణ శుద్ధ చతుర్థినాడు జరుపుకుంటారు
ఈరోజు నాగుల చవితి రేపు నాగపంచమి..నాగేద్రునికి పాలు పోస్తూ
ఈ శ్లోకాన్ని చెప్పుకోవడం మన ఆనవాయితి
నమస్తే దేవదేవేశ..నమస్తే ధరణీధర
నమస్తే సర్వ నాగేంద్ర..ఆదిశేష నమో స్తుతే
ఆ నాగేంద్రునికి చలిమిడి,చిమిలి,చేసి,విగ్రహానికి పాలుపోసి
నానబెట్టిన పెసరపప్పు పెట్టి గన్నెరు,జాజి,మొగలి పూలతో
పూజచేయాలి.
సాయంత్రం మతాబులు,కాకరపువ్వొత్తులు,టపాసులు
అందరం కలిసి సరదాగా కాలుస్తాము.
పాముకు పాలు పోసేటప్పుడు మా నానమ్మ
మాకు ఇలా పాట నేర్పించింది.
నడుము తొక్కితే నావాడు అనుకో..పడగ తొక్కితే పగవాడు కాదు అనుకో
తోక తొక్కితే తోటి వాడు అనుకో..నా కంట నువ్వుపడకు
నీకంట నేను పడకుండా చూడు తండ్రీ..అని నేర్పింది.
ఇది ఏమి టి అని అమ్మమ్మను అడిగితే
ప్రకృతి ని పూజిచటం మన సంస్కృతి అన్నది.
మనం విషసర్పమును కూడా పూజించి మన
శత్రువును కూడా ఆదరిస్తాము అని అర్ధము.
No comments:
Post a Comment