Friday, October 30, 2015

సంకష్టహరచవితి వ్రత విధానం



ఓం గం గణపతయే నమః___/\___
సంకష్టహరచవితి వ్రత విధానం 
30-10-2015, శుక్రవారం, ఆశ్వీయుజ బహుళ చవితి, సంకష్టహర చతుర్థీ.

సంకష్టహర చతుర్థి, దీన్నే సంకట చతుర్థి, సంకట చవితి అని కూడా అంటారు. నిజానికి ఇది సంకటహర చవితి. గణపతికి సంబంధించిన ఈ చతుర్థిని ఆలంబనగా చేసుకొని చేసే వ్రతాన్ని సంకటవ్రతం అంటారు.

ప్రతిమాసం కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి తరువాత 3,4 రోజుల్లో చవితి వస్తుంది. ప్రదోషకాలంలో (సూర్యాస్తమయ సమయంలో) చవితి ఎప్పుడు వుంటుందొ ఆ రోజున సంకష్టహర చవితిగా లెక్కలోకి తీసుకోవాలి. రెండు రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండటం సాధారణంగా జరగదు. ఒక వేళ ఎప్పుడైనా అలా జరిగితే తదియతో కూడిన చవితినే సంకటహర చవితిగా తెలుసుకోవాలి.

సాధారణంగా ఎక్కువ క్యాలెండర్లలోనూ, పంచాంగాలలోనూ సంకష్టహరచతుర్థి తెలియజేయబడి ఉంటుంది. ఈ వ్రతం ఆచరిస్తే జరగని పని లేదు.

ఈ వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలలు ఆచరిస్తారు. ఈ సంకట వ్రతాన్ని సంకట చవితి రోజున ప్రారంభించాలి. ప్రారంభించే రోజున స్నానానతరం గణపతిని పూజించి,తరువాత ఎరుపు లేద తెలుపు జాకెట్ పీస్ గాని, సుమారు అరమీటరు చదరం గల ఎరుపు లేద తెలుపు రంగుగల కాటన్ గుడ్డను గాని తీసుకొని గణపతి ముందుంచి దానికి పసుపు పెట్టి చిటికెడు కుంకుమ వేసి స్వామిని తలుచుకొని మనసులో వున్న కోరికను మనసార స్వామికి తెలిపి మూడు దోసిళ్ళు (గుప్పిళ్ళు) బియ్యాన్ని అందులో పొయ్యాలి. ఆ తరువాత 2 ఎండు ఖర్జురాలు, 2 వక్కలు, దక్షిణ ఉంచి తమలపాకులను అందులో వుంచాలి. మనసులొని కోరికను మరోసారి తలచుకొని మూటకట్టాలి. దానిని స్వామి ముందు ఉంచి ధూపం (అగరుబత్తి) వెలిగించి టెంకాయ లేద పళ్ళు నివేదన చేయాలి.

ఏదైనా ‪‎గణపతి‬ ఆలయానికి వెళ్ళి ఆలయం చుట్టు 3,11 లేదా 21 సార్లు ప్రదక్షిణ చేయాలి. వీలైనంత వరకు గణపతికి ఇష్టమైన గరిక వంటి వాటిని సమర్పించాలి. ఆలయానికి వెళ్ళటం సాధ్యం కానప్పుడు ఇంట్లోనే ఒకచొట గణపతిని వుంచి ప్రదక్షిణ చేయవచ్చు. పూజలో ఉన్న గణపతిని తీయకూడదు. శారీరికంగానూ, మానసికంగానూ స్వామికి ఎంత సేవ చేశామన్నది ముఖ్యం. అంతేకానీ ఎన్ని టెంకాయలు సమర్పించాం, ఎన్ని పళ్ళు నివేదించాం అన్నది ముఖ్యం కాదు.

సూర్యాస్తమయం అయిన తరువాత స్నానం చేసి దీపం వెలిగించి స్వామికి లఘువుగా పూజ చేయాలి. "సూర్యాస్తమయం వరకు ఉడికించిన పదార్ధంగాని, ఉప్పు తగిలిన (కలిసిన) / వేయబడిన పదార్ధాలు తినకూడదు". పాలు, పళ్ళూ, పచ్చి కూరగాయలు తినవచ్చు. అనుకున్న సమయం (3,5,11 లేదా 21 'చవితి 'లు) పూర్తి అయ్యేవరకు ఇలాగే ప్రతి సంకటహర చవితికి చేయాలి. చంద్రోదయం తరువాత చంద్రదర్శనం లేదా నక్షత్ర దర్శనం చేసుకొని చంద్రునకు ధూప, దీప, నైవేద్యాలను సమర్పించి మాములుగా భోజనం చేయాలి. నియమం పూర్తి అయ్యాక ముడుపు కట్టిన బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం భుజించాలి.

ఈ వ్రతం వల్ల ఏది కొరినా సిద్దిస్తుందని ప్రతీతి. (సేకరణ : శ్రీ శైల ప్రభ కొంత సవరణలతో )

ఈ మొత్తం ఆచరించడం కష్టమని భావించేవారు, ఉపవాసం చేసి, సంకటనాశన గణేశ స్తోత్రం చదివి, దగ్గరలో ఉన్న గణపతి ఆలయాన్ని సందర్శించినా సరిపోతుంది.

ఉపవాసం కూడా చేయలేనివారు, కనీసం 4 సార్లు శ్రీ సంకటనాశనగణేశ స్తోత్రం పఠించడం ఉత్తమం.

(‪‎సంకష్టహరచవితి‬ మంగళవారం వస్తే, దాన్ని అంగారక చతుర్థీ అంటారు. సంకష్టహర చవితి మంగళవారం రావడం విశేషం. ఈ అంగారక చవితి రోజున గణపతిని పూజించడం వలన జాతకంలో కుజదోషాలు పరిహారమవుతాయి, జీవితంలో సంకటాలు తొలగిపోతాయి. ఈ సారి సంకటహర చవితి శుక్రవారం వచ్చింది.)
Gudimetla Nagaraj గారి రచన 

సంకష్టహర చతుర్థి స్తోత్రం 

నారద ఉవాచ
ప్రణమ్యా శిరసా దేవం గౌరీపుత్రం వినాయకమ్
భక్తావాసం స్మరేన్నిత్యం ఆయుష్కామార్థ సిద్ధయే 
ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం
తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకమ్ 
లంబోదరం పంచమం చ షష్ఠం వికటమేవ చ
సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తథాష్టమమ్ 
నవమం ఫాలచంద్రం చ దశమం తు వినాయకమ్
ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననమ్ 
ద్వాదశైతాని నామాని  త్రిసంధ్యం యః పఠేన్నరః
న చ విఘ్నభయం తస్య సర్వ సిద్ధిసరం ప్రభో
విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనమ్
పుత్రార్థీ లభతే పుత్రాన్ మోక్షార్థీ లభతే గతిమ్
జపేత్ గణపతి స్తోత్రం షడ్భిర్మాసైః ఫలం లభేత్
సంవత్సతేణ సిద్ధిం చ లభతే నాత్ర సంశయః 
అష్టేభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వా యః సమర్పయేత్
తస్య విద్యా భవేత్ సర్వా గణేశస్య ప్రసాదతః
Narada Uvacha:

Sage Narada told


Pranamya Sirasa Devam,
Gauri Putram, Vinayakam,
Bhakthya Vyasa Smaren Nithya,
Mayu Kama Artha Sidhaye.

The learned one, who wishes,
For more life, wealth and love,
Should salute with his head,
Lord Ganapathi who is the son of Goddess Parvathi


Prathamam Vakra Thundam Cha,
Ekadantham Dveethiyakam,
Trithiyam Krishna Pingalaksham,
Gajavakthram Chathurthakam.

Think him first as god with broken tusk,
Second as the God with one tusk,
Third as the one with reddish black eyes,
Fourth as the one who has the face of an elephant


Lambhodaram Panchamam Cha,
Sashtam Vikatameva Cha,
Sapthamam Vignarajam Cha,
Dhoomra Varnam Thadashtamam

Fifth as the one who has a very broad paunch,
Sixth as the one who is cruel to his enemies,
Seventh as the one who is remover of obstacles,
Eighth as the one who is of the colour of smoke.


Navamam phala chandram cha,
Dasamam thu Vinayakam,
Ekadasam Ganapathim,
Dwadasam the gajananam.

Ninth as the one who crescent in his forehead,
Tenth as the one, who is the leader of remover of obstacles,
Eleventh as the leader of the army of Lord Shiva,
And twelfth as the one who has the face of an elephant.


Dwathasaithani Namani,
Trisandhyam Ya Paden Nara,
Na Cha Vigna Bhayam Thasya,
Sarva Sidhi Karam Dhruvam.

Any one reading these twelve names,
At dawn, noon and dusk,
Will never have fear of defeat,
And would always achieve whatever he wants.


Vidyarthi Labhadhe Vidhyam,
Danarthi Labhathe Danam,
Puthrarthi Labhathe Puthran,
Moksharthi Labhathe Gatheem.

One who pursues education will get knowledge,
One who wants to earn money will get money,
One who wishes for a son, will get a son,
And one who wants salvation will get salvation.


Japeth Ganapathi Sthothram,
Shadbhir Masai Phalam Labeth,
Samvatsarena Sidhim Cha,
Labhathe Nathra Samsaya.

Results of chanting this prayer,
Of Ganapati will be got within six months,
And within a year, he would get all wishes fulfilled,
And there is no doubt about this.


Ashtanam Brahmanam Cha,
Likihithwa Ya Samarpoayeth,
Thasya Vidhya Bhaveth
Sarvaa Ganesasya Prasadatha.

One who gets this prayer,
Written by Eight Brahmanas,
And offers it to Lord Ganesha,
Will become knowledgeable,
And would be blessed with all stellar qualities,
By the grace of Lord Ganesa.

Ithi Sri Narada Purane Samkashta Nasanam Ganapathi Stotram Sampoornam

No comments: