అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు
యోగీశ్వరో మహాశయనా కార్తికేయోగ్ని నందనః
స్కందః కుమారః సేనాని స్వామీ శంకర సంభవః
గాంగేయ స్థామ్ర చూడశ్చ బ్రహ్మచారి షికిధ్వజః
తారకారి ఉమాపుత్ర క్రౌంచారీశ్చ షడాననః
శబ్ద బ్రహ్మ సముద్రశ్చ సిద్ధః సారస్వతౌ గుహః
సనత్ కుమారౌ భగవాన్ భోగ మోక్ష ఫలప్రదః
సర జన్మ గణాధీశా పూర్వజో ముక్తి మార్గకృత్
సర్వాగమ ప్రణీతాచ వాంచితార్ధ ప్రదర్శినః
అష్ట వింశతి నామాని మదీయానీతి యః పఠేత్
ప్రత్యుషే శ్రద్ధయా యుక్తో మూకో వాచ పతిర్భవేత్
మహామంత్ర మయానీతి మామనామాను కీర్తనం
మహా ప్రజ్ఞా మవాప్నోతి నాత్ర కార్య విచారణా
అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు! మళ్ళీ వచ్చిందేంటిరా బాబూ అనుకుంటున్నారా?
మొన్న దీపావళికి దిబ్బు దిబ్బు దీపావళి మళ్ళీ వచ్చే నాగుల చవితి అనుకున్నాం కదా!
నాగుల చవితి వచ్చింది అందుకే నేను కూడా వచ్చా!
వృశ్చిక రాశిలో వచ్చే జ్యేష్ఠ నక్షత్రాన్ని సర్ప నక్షత్రం అంటారు.
ఈ నక్షత్రంలో సూర్యుడు సరిగ్గా కార్తీక శుద్ధ చవితి నాడు ప్రవేశిస్తాడు.
ఇలా ప్రవేశించిన రోజుని నాగుల చవితి అంటారు.
పాములు అనేవి మనకి పరోక్షంగా చాలా మేలు చేస్తాయి.
భూమి అంతర్భాగాలలో ఉంటూ భూమిని నాశనం చేసే క్రిముల్ని,
పురుగుల్ని తినేసి మన భూసారాన్ని కాపాడుతూ నీటి వనరుల కింద ఉపయోగపడతాయి.
అటువంటి పాముల్ని ఈ రోజున కొలిచి మనకి తిండికి, ఆరోగ్యానికి, సంతానానికి,
ఏ రకమయినటువంటి ఇబ్బందులు కలగకుండా కాపాడమని ఈ రోజున ప్రత్యేక పూజలు చేస్తాము.
పాహి పాహి సర్పరూప నాగదేవ దయామయ
సత్సంతాన సంపత్తిం దేహిమే శంకర ప్రియ
అనంతాది మహానాగ రూపాయ వరదాయచ
తుభ్యం నమామి భుజగేంద్ర సౌభాగ్యం దేహిమే సదా
అంటూ పుట్టలో పాలు పోసి పడగ త్రొక్కితే పారిపో, నడుము త్రొక్కితే నావాడనుకో, తోక త్రొక్కితే తొలగిపో,
సుబ్రహ్మణ్యేశ్వర స్వామీ చీకటా వాకిటా తిరుగుతూ ఉంటాము నీ బిడ్డలనుకుని మమ్మల్ని కాపాడు తండ్రీ అని దణ్ణం పెట్టుకుని,
నూకని ఆ పుట్ట చుట్టూ నూకలు నువ్వు తీసుకుని మూకలు మాకివ్వు తండ్రీ అని చల్లి పుట్టమన్ను చెవులకి పెట్టుకుంటాము.
మనకి పంట సరిగ్గా పండి మన పొట్ట నిండటానికి ఎంతో సహాయపడే ఈ పాముల్ని
ఈ ఒక్కరోజన్నా మనసారా తలుచుకుని వాటి ఆకలి దప్పికలు తీర్చడమే ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశ్యం.
వాస్తవానికి పాములు పాలు త్రాగుతాయా అన్నది చాలా మందికి సందేహమే!
పాములు సరీసృపాలు. వీటికి బాగా దాహం వేస్తే దప్పిక తీర్చుకోడానికి పాలే కాదు మనం కోక్,
పెప్సి లాంటివి పట్టించినా త్రాగుతాయి. పాలు ఎక్కువగా త్రాగితే వాటి ప్రాణానికే ముప్పు. ఇది పుట్టలో పాల కథ.
మానవ శరీరం పంచభూతాలతో తయారయినదే! అలానే మన శరీరాన్ని
ఒక పుట్ట లేదా వల్మీకముతో పోల్చుకుంటే అందులో ఉండే పామే మన వెన్నుముక (వెన్ను పాము)
క్రింద ఉండే కుండలినీ శక్తి (అథో కుండలిని). యోగశాస్త్రం ప్రకారం
మనకి మూలాధార చక్రంలో ఉండే కుండలినీ శక్తి నిదురించే పాములా ఉంటుందని చెప్తారు.
ఆ విధంగా ఈ పాము నిదురిస్తున్నా, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే విషాన్ని క్రక్కుతూ
మనల్ని విషపూరితులని చేస్తుంది.
ఆ ప్రభావం నుండి తప్పించుకోవడానికి ఆ పాము తృప్తి చెందేలా పాలు పోసి మనలో ఉన్న ఆ పాము విషాన్ని క్రక్కకుండా మంచిగా ఉండేలా చేస్తాము.
అంటే విషనాగుని దైవ నాగు కింద మారుస్తాము. అప్పుడు మనిషిలోని విషం నశించి శేషతల్పమై మనలోని విష్ణువు సేద తీరుతాడు.
ఇది పొట్టలో పాల గురించి.
అదండీ చక్కగా పుట్టలోను, పోట్టలోను పాలు పోసి ఎంచక్కగా ఈ పండగ చేసుకోండి! మీరు పాలు త్రాగుతూ ఉండండి
navarasa {jna} bharitam blog nundi sekarinchinadi
17-11-12
No comments:
Post a Comment