Wednesday, April 25, 2012

నమో వేంకటేశా నమో తిరుమలేశానమో వేంకటేశా నమో తిరుమలేశా
నమస్తే నమస్తే నమః

నమో వేంకటేశా నమో తిరుమలేశా
మహానందమాయె ఓ మహాదేవదేవ "నమో"

ముడుపులు నీకొసగి మా మొక్కులు దీర్తుమయా
ముక్తి కోరి వచ్చే నీ భక్తుల బ్రోవుమయా
భక్తుల బ్రోవుమయా "నమో"

నరక తుల్యమౌ యీ భువి స్వర్గము చేయవయా
మనుజులు నిను చేరే పరమార్థము తెల్పవయా
పరమార్థము తెల్పవయా "నమో"

నమో వేంకటేశా నమో తిరుమలేశా
నమో వేంకటేశా నమో తిరుమలేశా
నమో తిరుమలేశా నమో నమో తిరుమలేశా

No comments: