దీపేన సాధ్యతే సర్వమ్ సంధ్యా దీప నమ్మోస్తుతే ||
దీపావళి పండుగ ప్రతి సంవత్సరము అశ్వీజమాసము లో వచ్చే ముఖ్యమైన పండుగ.ఈ పండుగను ప్రజలంతా ఎంతో సంతోషంగా జరుపుకుంటారు
దీపావళి అంటే దీపోత్సవం. ఆ రోజు దీప లక్ష్మి తన కిరణాలతో అమావాస్య చీకట్లను పాలద్రోలి జగత్తును తేజోవంతం
చేస్తుంది. ఆ వేళ సర్వశుభాలు, సంపదలు ప్రసాదించే లక్ష్మీదేవిని పూజించడం అనాదిగా వస్తున్న సాంప్రదాయం.
సిరులు కురిపించే ఆ చల్లని తల్లి ఆశీస్సులు ఎల్లవేళలా మనకందరికీ లభించాలనీ కోరుతూ...
నరకుడు చనిపోయిన రోజుని నరకచతుర్దశి అంటారు.ఇది ప్రతి సంవత్సరము ఆశ్వీజమాసము కృష్ణ చతుర్దశి రోజు వస్తుంది
,ఆరోజు నరకాసురుని బొమ్మలు తయారు చేసి కాల్చివేస్తారు.ఆ తరువాత రోజు , అంటే ఆశ్వీజమాస అమావాస్య నాడు దీపావళి పండుగగా జరుపుకుంటారు
దీపావళి అంటే దీపాలవరుస. అజ్ఞానంధకారాన్ని పారదోలి, జ్ఞానకాంతులను విరజిమ్మే ఉత్తమోత్తమ పండుగ
నరకుని మరణం ప్రపంచానికంతటికీ ఆనందాన్ని ఇస్తూ ,
ముంగిట ముత్యాల ముగ్గులతో , మామిడి తోరణాలతో , ముంగిట దీపాల వరసతో కళకళలాడే ,
దేదీప్యమానంగా వెలిగే దీపాలశోభతో మన అందరి జీవితాలు ఆ ధనలక్ష్మి చల్లని చూపులతో
దేదీప్యమానంగ వెలగాలని టపాసుల సందడిలో మన బాధలన్ని తొలిగి మన బ్రతుకులులు
కోలాహలంగా వుండాలని ,
ఈ దీపావళి రోజున మనకందరికీ జ్ఞాన~ జ్యోతిని వెలిగించమని కోరుతూ
మీ శక్తి........
1 comment:
శ్లోకాల గురించి మరింత సమాచారం తెలుసుకొనుటకు ఈ క్రింది లింకుని చూడండి.
http://www.samputi.com/launch.php?m=home&l=te
Post a Comment