ఇతి శ్రీ వారాహీ స్తోత్రమ్ సమాప్తం vaaraahi kaaryasidhi mantram Om mai klam Om namO bhagavatii uchishTa vaaraahi trilOkava Sankarii mama sakala kaaryaam saadaya saadaya huum bhaT swaaha వారాహి కార్యసిధి మంత్రం ఓం మై క్లం ఓం నమో భగవతీ ఉచిష్ట వారాహి త్రిలోకవ శంకరీ మమ సకల కార్యాం సాదయ సాదయ హూం భట్ స్వాహ వారాహి గాయత్రీ మంత్రం ఓం మహిషద్వజాయై విద్మహే దండ హస్తాయై ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని 108 సార్లు చెప్పుకొంటే మీరు అనుకొన్న పనులు జరుగుతాయి వారాహి దేవి మంత్రం ఈ మంత్రాన్ని జపిస్తే ఏ మంత్రమైనా తొందరగా సిద్ధిస్తుందిట. అలాగే స్వప్న వారాహి మంత్రం చేస్తే కలలో దేవి కనిపించి సాధకుని ప్రశ్నలకు జవాబిస్తుందిట. దుస్వప్నాలని కూడా రాకుండా ఈ శక్తి కాపాడుతుందని నమ్ముతారు. చిన్న పిల్లలకు ఈ మంత్రం తో విబూది పెడితే పీడ కలలు రావంటారు.
ఓం హ్రీం నమో వారాహి ఘోరే స్వప్నం ఠః ఠః స్వాహా ఈ మంత్రాన్ని 18 సార్లు పఠిస్తే అనుకొన్న కార్యం ఫలిస్తుంది ఇది నిజం
జ్వరాది వ్యాధుల్ని పోగొట్టే ’శీతలాదేవి’ విశ్వచక్రంలోనున్న దేవతాశక్తుల్ని దివ్య మంత్ర నామ స్తోత్రాదులతో స్పందింపజేసి అభీష్టసిద్ధుల్ని సాధించే ’శబ్దచికిత్సా’ విధానాలను మన ఋషులు ఏర్పాటు చేశారు. వ్యాధుల్ని నివారింపజేసి, జ్వరాలను తొలగించే శక్తి ఉన్న శీతలాదేవిని ఉత్తరాది, వంగదేశం, ఉత్కళ రాష్ట్రాలలో ఎక్కువగా ఆరాధిస్తారు. సుమారు ప్రతి దేవాలయంలో శీతలాదేవికి చిన్న ఆలయముండడమే కాక, ప్రత్యేకించి శీతలా మందిరాలు సైతం కనిపిస్తుంటాయి. శీతలా స్తోత్రాలు నిత్యపారాయణాలుగా ఉండడమే కాక, అతి సామాన్యులు సైతం ఈ తల్లిని ఆరాధిస్తుంటారు. ఒకసారి రామకృష్ణ పరమహంస శిష్యునికి అనారోగ్యం కలిగింది. అప్పుడతను మాత శారదాదేవితో రైల్లో ప్రయాణిస్తున్నాడు. అనారోగ్యం కారణంగా ఆ శిష్యుడు మూసిన కళ్లు తెరవలేక పోతున్నాడు. అది నిద్రో, లేవలేని నిస్సహాయతో గానీ ఆ అస్పష్ట కలత నిద్రలోనే అతనికొక భయంకరమైన ఆకారం ఒకటి కనిపించి 'ఇప్పటికే నేను నిన్ను మృత్యువుకు అప్పచెప్పి ఉండేదాన్ని. కానీ, నీ గురువాజ్ఞ మేరకు వదిలి పెడుతున్నాను. అయితే, ఇందుకు కృతజ్ఞతగా నేనుచూపించే ఈ దేవతామూర్తికి నువ్వు బాగా తియ్యగా ఉండే రసగుల్లాలను నైవేద్యం పెట్టాలి' అని ఆదేశించి అదృశ్యమైంది. ఆ ఆకారం చూపించిన దేవతా మూర్తి ఎర్రని పట్టు వస్త్రాన్ని ధరించి ఉంది. ఆ తరువాత చిత్రంగా అతని అనారోగ్యం నయమైంది.ఎంత తీవ్రమైన జ్వరంగానీ, ఎంతో కాలంనుండి తగ్గకుండా పీడి స్తున్న వ్యాథులు పీడిస్తుంటే ఈ తల్లికి భక్తిశ్రద్ధలతో మొక్కుకుంటే తప్ప కుండా అవి నివారణ మవుతాయని భక్తుల ప్రగాఢవిశ్వాసం. అనంతశక్తి స్వరూపిణియైన జగదంబ తన అనంత అనుగ్రహాన్ని వివిధ విధాలుగా అందించడానికి అనంత రూపాలను ధరించింది. అలాంటి రూపాలలో ఈ శీతలాదేవి ఒకటి, జ్వరహరణ శక్తులలో ఒకటి. గాడిద వాహనంపై కూర్చుని చేట, చీపురు, కలశంవంటి వాటితో ప్రకాశించే ఈ తల్లిరూపం రోగనాశక శక్తులకు సంకేతం. జంతువులలో కూడా అనేక రహస్య శక్తులుంటాయి. ఆ శక్తుల్ని గమనిస్తే - కొన్ని జంతువుల ఇంద్రియాలలో సూక్ష్మశక్తులున్న విషయం స్పష్టమౌతుంది. ఆ ప్రత్యేకతలన్నీ విశ్వశక్తిలోని అంశాలే. శక్తులకు సూక్ష్మ జగత్తులో ఉన్న ఆకృతులను మంత్రద్రష్టలు దర్శించి, వాటిద్వారా మనం తగిన ప్రయోజనాలను పొందాలని వివిధ స్తోత్రాలనందించారు. గాడిద, చేట, చీపురు, కలశం - ఈపరికరాలు రోగకారక క్రిమినాశన, జ్వరహరణ శక్తులకు సంకేతాలు. స్ఫోటకము, ఉష్ణతలు, తీవ్రజ్వరాలు నశించడానికి, పిల్లలకు వచ్చే ఆటలమ్మవంటి ’మారీ’ వేదనలు తొలగడానికి, శీతలాదేవిని తలంచి ఈ స్తోత్రం చదివితే చాలు - తప్పక ఆ వ్యాధులు నివారణ అవుతాయని శాస్త్రోక్తి. "శీతలా" నామస్మరణమే జ్వరతాపాలను పోగొడుతుందని పురాణవచనం. అస్యశ్రీ శీతలాస్తోత్రస్య మహాదేవ ఋషిః - అనుష్టుప్ ఛన్దః - శీతలా దేవలా దేవతా - లక్ష్మీర్బీజం - భవానీశక్తిః -సర్వ విస్ఫోటక నివృత్తయే జపే వినియోగః